ఏపీలోని కూటమి సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్ ను శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. పయ్యావుల బడ్జెట్ ను సాధారణంగానే అధికార కూటమి పార్టీల నేతలు ఆకాశానికి ఎత్తేయగా… విపక్ష వైసీపీ ఇదేం బడ్జెట్ అంటూ పెదవి విరిచింది. ఈ తరహా వైఖరి ఏ ఒక్కరికి కూడా కొత్తేమీ కాదు. ఒకరి బడ్జెట్ ను మరొకరు తప్పుబడుతూనే ఉంటారు. రాజకీయం అన్నాక… అవతలి వారి పద్ధతులు నచ్చినా కూడా నచ్చలేదనే చెప్పాలి. లేదంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు మరి. అది రాజకీయాల్లో ప్రాథమిక సూత్రం కూడానూ. ఈ సూత్రాన్ని బాగానే ఒంటబట్టించుకున్న వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా మీడియా ముందుకు క్యూ కట్టారు.
అదేంటో గానీ… ఏపీకి సంబంధించిన ఎంతటి కీలక విషయాలపై అయినా… హైదరాబాద్ నుంచే స్పందించే అలవాటున్న వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా నాన్ స్టాప్ గా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… శుక్రవారం ఏపీకి వచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన పయ్యావుల పద్దుపై తనదైన శైలి విమర్శలు గుప్పించారు.
పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు ”గత ప్రభుత్వం” అని పలికారని… ఓ 10 సార్లు ”విధ్వంసం” అనే మాటను వాడారని బుగ్గన విశ్లేషించారు. ఈ సందర్భంగా ఇంకెంత కాలం వైసీపీని విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి సర్కారు పాలన ప్రారంభం అయి ఇప్పటికే దాదాపుగా ఏడాది కావస్తోంది అని చెప్పిన బుగ్గన… ఇకనైనా వైసీపీ నామస్మరణ మాని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో దేనికెంత కేటాయించారన్న విషయాన్ని తెలుసుకోవాలంటే… బడ్జెట్ పాఠాన్ని పూర్తిగానే కాకుండా క్షుణ్ణంగా వెతకాల్సి ఉంటుందని బుగ్గన చెప్పారు. అంటే… కేటాయింపులను ఎక్కడో కనీ కనిపించకుండా చేయడం పయ్యావులకు అలవాటని ఆయన విమర్శించారు. గతేడాది ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనూ పయ్యావుల ఇదే తరహా విధానాన్ని అవలంభించారని కూడా బుగ్గన గుర్తు చేశారు.
ఈ మాట విన్నంతనే…పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో ”గత ప్రభుత్వం” అనే పదాన్ని అన్నేసి సార్లు పలికారని, ”విధ్వంసం” అన్న పదాన్ని ఇన్నేసి సార్లు పలికారని మీకెలా తెలిసింది సార్ అంటూ కూటమి వర్గాలు సెటైర్లు అందుకున్నాయి. ఎంతైనా మీరు కూడా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారే కదా… పయ్యావుల బడ్జెట్ ఆ మాత్రం మంచిగా ఉంది కాబట్టే మీరు బట్టీ పట్టేశారని కూడా బుగ్గనను ఓ ఆట ఆడుకుంటున్నారు.
This post was last modified on February 28, 2025 7:04 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…