Political News

హ‌రీష్‌రావుపై ‘నేర పూరిత కుట్ర’ కేసు.. ఏం జ‌రిగింది?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీల‌క నేత హ‌రీష్‌రావుపై హైద‌రాబాద్ లోని బాచుప‌ల్లి పోలీసులు.. కేసు న‌మోదు చేశారు. త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని పేర్కొంటూ .. బాచుప‌ల్లికి చెందిన చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే 42 ఏళ్ల వ్య‌క్తి పోలీసులను ఆశ్ర‌యించారు. హ‌రీష్ రావుతో పాటు.. సంతోష్‌కుమార్‌, రాములు, వంశీ అనే వ్య‌క్తులు త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నా రు. వారినుంచి త‌న‌కు ప్రాణ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్నారు.

చక్ర‌ధ‌ర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బాచుప‌ల్లి పోలీసులు హ‌రీష్‌రావుపై భార‌తీయ న్యాయ సంహిత (బీ ఎన్ ఎస్‌)లోని సెక్ష‌న్ 351(2)(నేర పూరిత కుట్ర‌), రెడ్ విత్ 3(5) సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. దీనిలో రెండో నిందితుడిగా(ఏ-2) హ‌రీష్‌రావును పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన త‌ర్వాతే.. ఫిర్యాదుపై కేసు న‌మోదు చేశామ‌ని పేర్కొన్నారు.

ట‌న్నెల్ పై త‌గువు!

ఎస్‌ఎల్‌బీసీ ట‌న్నెల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న రాజ‌కీయంగా దుమారానికి దారి తీసింది. ఇక్క‌డ‌కు మాజీ మంత్రి హ‌రీష్‌రావు రావ‌డం.. ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హ‌రీష్‌రావు రాష్ట్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే హ‌రీష్‌రావు విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఆయ‌న కుటుంబం… ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావుకు జూప‌ల్లి మూడు ప్ర‌శ్న‌లు సంధించారు.

1) టన్నెల్‌ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారు?
2) కాంట్రాక్లులో తక్కువ లాభం వస్తుందన్న అంచ‌నాతోనే వ‌దిలేశారా?
3) కాంగ్రెస్ హ‌యాంలో చేప‌ట్టిన టన్నెల్‌ నిర్మాణం పూర్తి అయితే మీకు పేరు రాదు కాబ‌ట్టి వ‌దిలేశారా? అని నిల‌దీశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ ఎస్ నాయ‌కులకు లేద‌న్నారు.

This post was last modified on February 28, 2025 4:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: Harish Rao

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago