తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ)కి కొత్త ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ కార్యరంగంలోకి దిగేశారు. అసలే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నూతన ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి ఏ రేంజిలో ఎంట్రీ ఇస్తారోనని అంతా అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నటరాజన్… ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రైల్లో వచ్చారు.
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన లో రైలు దిగిన ఆమెను చూసి కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయాయి. ఎలాంటి హంగు లేదు… ఆర్భాటం అసలే లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు… వీపున దుస్తులతో కూడిన ఓ లగేజీ బ్యాగు… చాలా సింపుల్ గా ట్రెయిన్ దిగిన ఆమెకు టీపీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్… పార్టీ కండువాతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనీసం బొకేలు, పూల మాలలు కూడా కనిపించకపోవడం గమనార్హం.
కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగిన మీనాక్షి… మహేశ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి నేరుగా దిల్ కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలతో పాటు కొందరు పార్టీ ముఖ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగానూ ఎక్కడా లాంఛనాలు, సత్కారాలు కనిపించలేదు. సీఎం రేవంత్ మాత్రం, ఓ బొకే, మరో శాలువాతో ఆమెను సత్కరించారు. అంతటితో స్వాగత కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నటరాజన్… నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. సీఎం, టీపీసీసీ చీఫ్ లతో ఆమె వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై వారి నుంచి ప్రాథమిక వివరాలను సేకరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీలోని వర్గ విభేదాలు, ఇటీవల చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను రేవంత్, మహేశ్ లు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చూడటానికి సాదాసీదాగా కనిపిస్తున్న మీనాక్షి నటరాజన్… పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ బృందంలో అత్యంత ముఖ్యురాలుగా కొనసాగుతున్నారు. అసలే దేశవ్యాప్తంగా పార్టీ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా పార్టీని కాస్తంత చక్కదిద్దకపోతే కష్టమేనన్న భావనతో రాహుల్ గాంధీనే స్వయంగా మీనాక్షిని రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కలకలమే రేపాయి. అదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరచూ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలవరాన్ని రేపుతోంది. వీటిని ఎక్కడికక్కడ నిలువరించడంలో మునుపటి ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సఫలం కాలేకపోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి బాధ్యతలు తీసుకున్నారు. స్టైల్లో సింపుల్ గానే కనిపిస్తున్న మీనాక్షి పని తీరులో మాత్రం నిక్కచ్చిగానే కాకుండా కఠినంగా వ్యవహరించే నేతగా పేరుంది. మరి టీపీసీసీని ఆమె ఏ రీతిన దారిలో పెడతారో చూడాలి.
This post was last modified on February 28, 2025 2:03 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…