Political News

రేవంత్ తో ‘ఎమ్మార్’ భేటీ.. వివాదం పరిష్కారమయ్యేనా?

ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలుగు నేల రాజకీయాలను భారీ కుదుపునకు గురి చేసిన వ్యవహారం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్… హైదరాబాద్ లో రియిల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం ఆ సంస్థకు కేటాయించిన భూములు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై పెను దుమారం రేగింది. ఫలితంగా ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..ఈ వివాదాల పరిష్కారం కోసం అడుగులు పడ్డా… అవి ముందుకు సాగలేదు.

తాజాగా గురువారం ఎమ్మార్ ప్రాపర్టీస్ కు చెందిన యజమాని మహ్మద్ అలీ రషీద్ తన కంపెనీ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. నేరుగా సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేఃశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కు చెందిన కీలక ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదాల పరిష్కారం దిశగా ఇరు వర్గాల మధ్య కీలక చర్చ జరిగింది. వాస్తవంగా 2001లో ఎమ్మార్ ప్రాపర్టీస్ కు కేటాయించిన భూముల విలువ ఇప్పుడు వేల కోట్లకు చేరిపోయింది. ఫలితంగా ఈ వ్యవహారంపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్న చివరి నాళ్లలో అంటే…200లో ఎమ్మార్ ప్రాపర్టీస్ ఏపీలోకి అడుగుపెట్టింది. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, విల్లాలు, గోల్ఫ్ కోర్సులు తదితరాల నిర్మాణంపై ఎమ్మార్ ఆసక్తి చూపగా… అందుకు అనుగుణంగా నాటి చంద్రబాబు సర్కారు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు హయాంలో కుదిరిన ఒప్పందాలను మార్చింది. ఎమ్మార్ చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాను 49 శాతం నుంచి కేవలం 4 శాతానికి కుదించింది. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారంపై పెను వివాదం రేగింది. నాటి కాంగ్రెస్ సర్కారు.. ప్రత్యేకించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి ఆ సంస్థ నుంచి భారీ ముడుపులు స్వీకరించినట్లుగా ఆరోపణలు రాగా… విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ వివాదాల పరిష్కారానికి అడుగులు పడ్డా…అవి ముందుకు సాగలేదు. ఇలాంటి క్రమంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టింది. తమ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని.. అందుకు తమ సంస్థ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని… దుబాయి ప్రభుత్వం నుంచి కూడా అదే తరహా సహకారం లభించేలా చేస్తామని కోరింది. ఈ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంలో ఎమ్మార్ యజమాని నేరుగా హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను నిబంధనలకు లోబడి తీసుకోవాలని అదికార యంత్రాంగానికి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. చూద్దాం… మరి రేవంత్ అయినా ఈ వివాదాన్ని పరిష్కారిస్తారేమో.

This post was last modified on February 27, 2025 8:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

2 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

3 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

4 hours ago

ఇక‌… బీజేపీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే జ‌గ‌న్‌.. !

కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుంద‌న్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…

5 hours ago

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…

7 hours ago

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో..…

8 hours ago