నిజమే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే… ఠక్కున ఇదే మాట గుర్తుకు వస్తోంది. ఈ ఫొటోలో చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్న నేత వైసీపీలో కీలక నేతగానే కాకుండా… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్న తోట త్రిమూర్తులు. తోట పక్కన కూర్చున్న నేత మొన్నటిదాకా వైసీపీలో కొనసాగి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ మంచి అనుబంధం కలిగిన నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉధయభాను. ఇటీవలే వైసీపీని వీడిన ఈయన జనసేనలో చేరిపోయారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేత.
రాజకీయ వైరం పరంగా చూస్తే.. వీరిద్దరూ బద్ధ శత్రువుల కిందే లెక్క. జగన్ అంటే జనసేన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అస్సలు పొసగడం లేదు. పవన్ అన్నా కూడా జగన్ అదే రీతిన సాగుతున్న వైనం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ, జనసేనలకు చెందిన ఇద్దరు కీలక నేతలు కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం ఓ డేరింగ్ నిర్ణయమేనని చెప్పక తప్పదు. వాస్తవానికి వీరిద్దరూ వియ్యంకులు. పార్టీలు వేరేతై మాత్రం బంధుత్వాన్ని వీడాల్సిన పని లేదు కదా. నిజమే. బావ, బావమరదులు మహాశివరాత్రి సందర్భంగా కలిశారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయంలోనే ఇలా కూర్చుని ఫొటోలు దిగారు.
తన బావ మరిది సామినేనితో కలిసి దిగిన ఫొటోను తోట త్రిమూర్తులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రాజకీయంగా వీరిద్దరి ప్రస్థానాలు భిన్నంగానే సాగాయి. టీడీపీతో రాజకీయాలు మొదలుపెట్టిన తోట… ఆ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా, తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక సామినేని ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతోనే సాగారు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.
This post was last modified on February 26, 2025 8:57 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…