ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది.
టెక్నికల్ గా ఏ శాసన సభలో అయినా 10 శాతం సీట్లు దక్కించుకున్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్వామి చెప్పారు. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అధికారంలో ఉందని, కాబట్టి, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై స్వామి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, చాలామందిని భయపెట్టి దాడులు చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని, తదుపరి చర్యలు లేవని అన్నారు. ఎన్నికల వేళ హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాని పిల్ వేశానని చెప్పారు. ఆ పిల్ మార్చి 12న విచారణకు వస్తుందని మీడియాకు వెల్లడించారు.
ఇక, తిరుపతి లడ్డూ అంశంపై కూడా స్వామి మాట్లాడారు. ఆ అంశం ముగిసిపోయిందని, కల్తీ లాంటి అంశాలు జరగకుండా చూడాలని అన్నారు. లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని, మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలని చెప్పారు.
This post was last modified on February 25, 2025 10:02 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…