ఏ పార్టీకైనా.. ఎదుగుదల ముఖ్యం. పార్టీ అధినేత ఎంత పాపులర్ ఫిగరైనా.. పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెడి తేనే కదా.. ఓట్లు రాలేవి. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేదు. అప్పట్లో తెలుగు వారి ఆరాధ్య దైవంగా మారిపోయినా.. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేసరికి రోడ్డుపైకొచ్చేశారు. అప్పటి పొలిటి కల్ సిట్యుయేషన్‌ను నమ్ముకున్నారు. దానికి తగిన విధంగా కెమిస్ట్రీని పండించారు. విన్నయ్యారు. సో.. ఎంత పాపులారిటీ ఉందనేదానికన్నా.. ఎంతగా ప్రజల్లోకి వెళ్లామనేదే కీలకం. ఇప్పుడు జనసేన విషయా నికి వస్తే.. ప్రశ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన.. పవర్ స్టార్ పవన్‌కు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఎన్నికలకు ఓ ఆరు మాసాల ముందు ప్రజల్లోకి రావడం.. ప్రచారం చేసుకోవడం, ఓ నాలుగు సినిమా డైలాగులు పేల్చడం.. తాటతీస్తాననడం పరిపాటిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కి ఎంతో భవిష్యత్తు ఉందని, తాను వెన్నుచూపే నాయకుడిని కాదని పదేపదే చెప్పే పవన్.. మరి దానికి తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా… అంటే.. కనిపించడం లేదు. ఎన్నికలు అయిపోయాయి. ఇక, నాకు పనేముందని అనుకున్నారో.. ఏమో.. పూర్తిగా హైదరాబాద్‌లోనే మకాం వేసేసి.. సినిమాలకు పరిమితయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే.. కొన్నాళ్ల కిందటి వరకు ట్వీట్ల ద్వారా అయినా.. ఆయన స్పందించేవారు.
కానీ, ఇప్పుడు వాటికి కూడా ఆయన అభిమానులు, ప్రజలు, పార్టీ నేతలు ఎదరు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం.. చాలా హాట్ హాట్‌గా ఉంది. ఒకవైపు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వరదలు, వర్షాలతో జిల్లాలకు జిల్లాలు అట్టుడుకుతున్నాయి. అదేసమయంలో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణల పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా విద్యుత్ మీటర్లకు రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలావుంటే, న్యాయవ్యవస్థపై జగన్ చేసిన తీవ్ర ఆరోపణలు.. న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సంధించిన లేఖ..
ఇక, ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కారణంగా.. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి.. సామాన్యుడు రోజు గడపడమే కష్టంగా మారిపోయింది. రాజధాని ఉద్యమానికి మూడువందల రోజులు నిండినా.. ప్రభుత్వం నుంచి ఇంకా ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. ఇలా అనేక విషయాలపైప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రజల తరఫున ఉంటాను.. ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రతిజ్ఞలు చేసిన పవన్.. వీటిపై మౌనంగా ఉండడం.. హైదరాబాద్‌కే పరిమితం కావడం వంటివి చర్చకు వస్తున్నాయి.
మరోవైపు ఆయా అంశాలపై కేవలం ప్రజాకోణంలోనే కాకుండా.. పార్టీ పరంగా కూడా పుంజుకునేందుకు వినియోగించుకునే అవకాశం కూడా పవన్ మిస్సవుతున్నారని పార్టీలోని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మంచి ఛాన్స్. పవన్ కనుక ఇక్కడే ఉండి.. ప్రభుత్వం చేస్తున్న పనులపై మాట్లాడితే.. ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. మేం కూడా ప్రజలలోకి వెళ్లి..పార్టీని డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది
అని పార్టీలోని కీలక నేతలు భావిస్తున్నారు. కానీ, పవన్ మాత్రం చాతుర్మాస్య దీక్షలు, సినిమా షూటింగులు అంటూ.. హైదరాబాద్‌కే పరిమితం కావడం.. కనీసం ట్విట్టర్‌లోనూ స్పందించకపోవడం వంటివి పార్టీకి రాజకీయంగా ఇబ్బందేననే విశ్లేషణలు కూడా వస్తుండడం గమనార్హం.
This post was last modified on October 25, 2020 8:09 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…