వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముప్పేట ఉచ్చు బిగుసుకుంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సత్వర్థన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో నేరుగా ఆయనను విచారించాలన్న పోలీసుల అభ్యర్థనను పరిగణనలో తీసుకున్న న్యాయస్థానం.. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
దీంత వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ లను కస్టడీలోకి తీసుకున్న విజయవాడ పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. అనంతరం కృష్ణ లంక పోలీస్టేషన్ కు తరలించి.. నేరుగా విచారించనున్నారు. మూడు రోజుల పాటు ఈ ముగ్గురినీ విచారణ చేయనున్న పోలీసులు సదరు నివేదికను కోర్టుకు సమర్పిస్తారు. ఇదిలావుంటే.. మరోవైపు.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.
గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేసినట్టు బాధితురాలు చెప్పారు. ఈ కేసులోనూ వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రాథమికంగా వంశీపై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
This post was last modified on February 25, 2025 3:13 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…