Political News

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ఇద్ద‌రికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చింద‌న్నారు. వీటిలో ఒక‌టి కిష‌న్ రెడ్డికి, రెండోది బండి సంజ‌య్‌కు మాత్ర‌మే ద‌క్కింద‌న్నారు. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను న‌మ్మించేందుకు బీజేపీ నేత‌లు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క ప‌ది మందికి కూడా ఉద్యోగాలు క‌ల్పించ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తాము అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 55 వేల మందికి పైగా ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇలాంటివారు రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ల‌కు ఇంకేం ఉపాధి చూపిస్తార‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. రాష్ట్రం లో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు తాము చేస్తున్న కృషి ఫ‌లితంగా ఇప్ప‌టికి 55 వేల మంది కి పైగానే యువ‌త‌కు ఉపాధి ల‌భించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప‌నీ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది బీజేపీ నేత‌ల వ్యూహ‌మ‌ని, అందుకే తాము చేప‌డుతున్న ప్ర‌తి పనికీ అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు.

లేకుంటే.. ఆర్ ఆర్ ఆర్ కు భూసేక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యి ఉండేద‌న్నారు. ఇలాంటి పార్టీకి ఓటేసి.. ప‌ట్ట‌భ‌ద్రులు త‌ప్పు చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. మీకు అండ‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తొలి ప్రాధాన్యతా ఓటును వేయాల‌ని కోరారు. కాగా.. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 27న జ‌ర‌గ‌నుంది.

This post was last modified on February 24, 2025 8:55 pm

Share

Recent Posts

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

8 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

2 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago