అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి సోమవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్ నెట్ లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే జీవీ రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లుగా సమాచారం. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తాను న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, ఇంకో పార్టీలో చేరబోనని కూడా ప్రకటించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి… న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించిన రెడ్డి…ఆర్థిక పరమైన నేరాల విశ్లేషణ, వాదనల్లో దిట్టగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన జీవీ రెడ్డి.. టీడీపీ విపక్షంలో ఉండగా పార్టీ తరఫున బలమైన గొంతుకగా మారారు. జీవీ రెడ్డి కారణంగానే ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పులు తీసుకుంటున్న వ్యవహారం జనాల్లోకి చొచ్చుకెళ్లింది. నాటి వైసీపీ సర్కారు… ఏఏ వారం…ఎంతెంత అప్పులు తీసుకుటోంది… దానికి ఎంతెంత వడ్డీలు చెల్లిస్తోంది అన్న వివరాలను ఆధారాలతో సహా ముందుగానే బయటపెట్టి సంచలనం రేపారు.
రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జీవీ రెడ్డి సత్తాను గుర్తించిన టీడీపీ అధిష్ఠానం…ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా కూటమి సర్కారు పాలన మొదలు అయిన నెలల వ్యవధిలోనే కీలక విభాగంగా ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ బృందంలో కీలక సభ్యుడిగా మారిన రెడ్డి… చంద్రబాబు దృష్టిలోనూ సత్తా కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో రెడ్డి… టీడీపీలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న వాదనలూ వినిపించాయి.
అయితే ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలను చూసి జీవీ రెడ్డి సహించలేకపోయారన్న వాదనలు వినిపించాయి. వచ్చీ రావడంతోనే రాజకీయ నియామకాలకు ఫైబర్ నెట్ కేంద్రంగా మారిందని పక్కా ఆధారాలను బయటపెట్టిన రెడ్డి… ఒకే ఉత్తర్వుతో 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. వీరంతా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారని, వారిలో కొందరు వైసీపీ నేతల ఇళ్లల్లో పనిచేసే వారని కూడా జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం కార్పొరేషన్ లో చిలికిచిలికి గాలివానలా మారింది. రెడ్డి తొలగించిన ఉద్యోగులకు సంస్థ ఎండీగా ఉన్న దినేశ్ కుమార్ వేతనాలు చెల్లించిన వైనం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. చైర్మన్ గా తాను తొలగించిన ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఎలా చెల్లిస్తారంటూ రెడ్డి… ఎండీ, ఇతర ఉన్నతాధికారులపై ఒంటికాలిపై లేచారు.
ఇలాగైతే కుదరదని భావించిన రెడ్డి… ఇటీవలే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎండీ దినేశ్ కుమార్ తో పాటు సంస్థ ఉన్నత అధికారుల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ అదికారి అయిన దినేశ్ కుమార్ రాజ ద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఐఏఎస్ లను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఐఏఎస్ లు అంతా కలిసి రెడ్డిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తొలుత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి చంద్రబాబుకు నివేదిక అందించారు. ఆ తర్వాత జీవీ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకునిపోవాలని.. వ్యవస్థ అన్నాక ఒకే రోజులో మార్పు సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక తాను ఈ వ్యవస్థలో ఇమడలేనని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. ఫైబర్ నెట్ తో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది.
This post was last modified on February 24, 2025 8:51 pm
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…
కేంద్ర ప్రభుత్వం వద్ద వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో అలా ఏళ్ల తరబడి ఉంటూనే ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…