Political News

వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీసు కస్టడీ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుంది. అయితే, ఈ కేసులో విచారణ కోసం వంశీని 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని ఆదేశించింది. విజయవాడ లిమిట్స్‌లోనే కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని ఆదేశించింది. ఇక, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న కారణంతో జైల్లో వంశీకి బెడ్ అనుమతించింది న్యాయస్థానం. రోజుకు మూడు సార్లు వంశీతో ఆయన లాయర్ కలిసి మాట్లాడేందుకు అనుమతినిచ్చింది.

మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే వంశీపై తదుపరి చర్యలకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. పీటీ వారెంట్ ప్రకారం సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన వంశీని…టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా విచారణ జరపొచ్చు.

This post was last modified on February 24, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

26 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago