Political News

బాబు ఫోక‌స్ : అమ‌రావ‌తి ప‌నులు ఎందాకా వ‌చ్చాయ్‌.. ?

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి మాట గ‌త ఏడాది డిసెంబ‌రు వ‌ర‌కు రోజూ మీడియాలో వినిపించింది.. క‌నిపించింది. డిసెంబ‌రు మూడో వారంలో ప‌నులు ప్రారంభిస్తున్నార‌ని.. ప‌నులు వ‌డివ‌డిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజ‌ధానికి ఒక రూపం తీసుకువ‌స్తామ‌ని మంత్రి పొంగూరు నారాయ‌ణ ప‌దే ప‌దే చెప్పారు. ఇక‌, జ‌న‌వ‌రి తొలి వారంలో కూడా ఇదే ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోవైపు సీఆర్ డీఏ కూడా.. ప‌నుల‌కు సంబంధించి కాంట్రాక్టు సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

అంతేకాదు.. రోజువారీగా టెండ‌ర్ల‌ను ఆహ్వానించి.. ప‌నులు శ‌ర వేగంగా చేప‌డుతున్నామ‌ని సీఆర్ డీఏ అధికారులు కూడా చెప్పారు. కానీ.. గ‌త 50 రోజులుగా అమ‌రావ‌తి ప్ర‌స్థావ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు తాజాగా ఆరా తీశారు. అస‌లు ఏం జ‌రుగుతోంద‌న్న ప్ర‌శ్న‌తో సంబంధిత అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయాల‌ని మ‌రోసారి కూడా దిశానిర్దేశం చేసిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే.. రెండు ర‌కాల స‌మ‌స్య‌లు ఇప్పుడు అమ‌రావ‌తిని వేధిస్తున్నాయి. 1) 30 అడుగుల్లోనే జ‌లాలు ఊర‌డం. 2) కాంట్రాక్టు సంస్థ‌లు బిడ్ల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభించేందుకు ముందుకు వ‌చ్చిన స‌మ‌స్య‌లు.. సాధార‌ణంగా.. నేల‌ను ప‌రీక్షించాయి. దీనిలో పెద్ద స‌మస్య వారిని వెంటాడుతోంది. కేవ‌లం 30 అడుగుల లోతులోనే.. భారీ ఎత్తున జ‌లాలు ఊరుతున్నాయి. దీంతో నిర్మాణాలు చేప‌ట్ట‌డం సాధ్యం కాద‌ని కొన్ని సంస్థ‌లు భావిస్తున్నాయి.

మ‌రోవైపు.. పెద్ద‌గా పోటీ ఉంటుంద‌ని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను చేప‌ట్టేందుకు సంస్థ‌లు ముందుకు వ‌స్తాయ‌ని స‌ర్కారు భావించినా.. నిర్మాణ వ్య‌యాల‌ను పెంచినా.. బిడ్డ‌ర్లు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. పైగా.. వ‌చ్చిన వారు కూడా ఇక్క‌డ జ‌లాలు ఊరుతుండ‌డంతో త‌మ బిడ్ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. దీంతో అమ‌రావ‌తి ప‌నులు కుంటుతున్నాయి. క‌నీసం ప్ర‌ధాన నిర్మాణ ప‌నుల‌కు కూడా బిడ్లు ప‌డ‌డం లేద‌ని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు. దీంతో మే వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌ని ప్రాధ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చేశారు.

This post was last modified on February 22, 2025 2:50 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

20 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago