Political News

జగన్ సేకరించిన దాన్నే… బాబు కొంటున్నారు

ప్రజాస్వామ్యం అన్నాక.. ఐదేళ్లకోమారు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… అధికారంలో ఉండే పార్టీలు మారుతూ ఉంటాయి. అయినంత మాత్రాన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు రద్దు చేసుకుంటూ పోలేవు కదా. తమ వైరి వర్గాలు తీసుకున్న నిర్ణయాలను కొన్ని సార్లు అమలు చేయక తప్పదు కూడా. ఆ పాత నిర్ణయాలు తప్పు అయినా…ఒప్పు అయినా కూడా కొన్ని సార్లు సర్దుకుపోక తప్పదు. ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లోనే కుదరొచ్చు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ పాలనలో జగన్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయాన్ని కూటమి పాలనలో చంద్రబాబు సర్కారు అమలు చేసి తీరక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో చేసుకున్న ఒప్పందంపై ఓ రేంజిలో రచ్చ సాగిన సంగతి తెలిసిందే. ఏపీ ఒప్పందం సెకీతోనే అయినా… కొనుగోలు చేసేది మాత్రం అదానీ గ్రూప్ నకు చెందిన కరెంటునే యకొనుగోలు చేస్తున్నారని, అదానీ నుంచి లంచాలు తీసుకునే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అదే సమయంలో ఈ తరహా ఒప్పందాల కోసం ఏకంగా అదానీ అమెరికా మదుపరుల నుంచి సేకరించిన నిధులను లంచాలుగా వినియోగించారంటూ ఆ దేశ కోర్టుల్లోనూ కేసు నమోదు అయిన వైనం మరింత సంచలనం రేకెత్తించింది. మొత్తంగా సెకీతో ఏపీ కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు అయిపోతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకే చంద్రబాబు సర్కారు సౌర విద్యుత్ ను అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం అయిపోయింది.

ఈ మేరకు సెకీతో ఏపీ ఒప్పందాలపై లెక్క్లలేనన్ని ఫిర్యాదులు రాగా..వాటిపై ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) విచారణ చేపట్టింది. గతంలోనూ ఏపీఈఆర్సీ నిబంధనల మేరకే ఈ ఒప్పందాలు జరిగాయి. అయినా కూడా ఆరోఫణలు రాగా ఏపీఈఆర్సీ మరోమారు ఈ ఒప్పందాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుందని తేల్చింది. అంతర్రాష్ట్ర రవాణా చార్జీలు కూడా లేని ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి లాభమే తప్పించి…లేశమాత్రం కూడా నష్టం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాల మేరకు సౌర విద్యుత్ ను సెకీ ద్వారా అదానీ నుంచి కొనుగోలు చేయవచ్చంటూ తెలిపింది. ఏపీఈఆర్సీ తీర్పుతో ఈ ఏడాది సెకీ నుంచి ఏకంగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ను ఏపీ కొనుగోలు చేయనుంది.

This post was last modified on February 22, 2025 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేను కేసీఆర్ కు కుక్కనే..కడియంకు పల్లా కౌంటర్

తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన సంగతి…

20 minutes ago

జాక్ మిస్సవుతున్న కిక్స్ ఇవే

టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…

7 hours ago

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం…

7 hours ago

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…

7 hours ago

“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…

7 hours ago

ట్రంప్ చర్యలకు బాబు బాధ్యుడా జగన్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…

8 hours ago