టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యవహారం రెండు, మూడు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. క్రిమినల్ లా చదివిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన అంశాలపై మంచి పట్టు కలిగి ఉన్నారు. ఈ కారణంగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏరికోరి మరీ జీవీ రెడ్డికి ఫైబర్ నెట్ పగ్గాలు అప్పజెప్పారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మాకాన్ని వమ్ము చేయని రీతిలో సాగిన జీవీ రెడ్ది వచ్చీ రావడంతోనే చెలరేగిపోలేదు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ వ్యవహారాలపై పూర్తిగా పట్టు సాధించాకే.. సంస్థలోని అక్రమాల దిద్దుబాటుకు ఆయన రంగంలోకి దిగారు.
ఈ క్రమంలో ఫైబర్ నెట్ కార్యాలయానికి రాకుండా.. కనీసం వర్క్ ఫ్రం హోం విధానంలోనూ అందుబాటులో లేకుండా.. అసలు పనే చేయకుండా 600లకు పైగా మంది వైసీపీ నేతలు కార్పొరేషన్ లో లక్షలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్నారని రెడ్డి నిగ్గు తేల్చారు. వారందరినీ సింగిల్ సంతకంతో ఆయన తొలగించేశారు. అక్కడితో సంస్థకు భారీ ఉపశమనం లభించినట్టేనని ఆయన భావించారు. అయితే కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ దినేశ్ కుమార్ ఈ తొలగింపులకు ఆమోదం తెలపలేదట. అంతేనా… ఓ వైపు వారందరినీ జీవీ రెడ్డి తొలగిస్తే…దినేశ్ కుమార్ ఫిబ్రవరి నెల వేతనాలను కూడా విడుదల చేసి పారేశారట. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక గడచిన 9నెలల కాలంలో సంస్థకు సింగిల్ పైసా ఆదాయం కూడా లభించలేదట. ఆదాయం రాకపోగా… అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా అదనపు పన్నును కట్టాల్సి వచ్చిందట.
ఈ అన్ని విషయాలను కళ్లారా చూసిన జీవీ రెడ్డి దాదాపుగా రగిలిపోయారని చెప్పాలి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్నింటినీ వరుసబెట్టి మీడియా ముందు పెట్టేశారు. ఎండీ దినేష్ కుమార్ తనకు సహకరించడం లేదని, ఇప్పటికీ ఆయన వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను అడిగిన రికార్డులు కూడా తనకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సంస్థకు చైర్మన్ గా ఉంటూ జీవీ రెడ్డి ఇలా మీడియా ముందు సంస్థ వివరాలన్నీ బయటపెట్టేసి… సంస్థను వివాదంలోకి లాగేయడంతో ప్రభుత్వ పెద్దలు అనివార్యంగా ఈ వ్యవహారంలోకి దిగక తప్పలేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ఫైబర్ నెట్ కార్యాలయంలో ఓ కీలక సమీక్షను నిర్వహించారు.
ఈ సమీక్షలో జీవీ రెడ్డితో పాటు ఎండీ దినేశ్ కుమార్, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ పాలుపంచుకున్నారట. సమీక్షలో భాగంగా జీవీ రెడ్డి తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. సంస్థకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి గానీ.. ఇలా మీడియాకు ఎక్కుతారా?అని ఆయనను నిలదీశారట. ఇక ఆ తర్వాత ఓ చైర్మన్ స్థానంలో ఉన్న నేతకు సహకరించకుండా మీరేం చేస్తున్నారు అంటూ దినేష్ కుమార్ ను మంత్రి ప్రశ్నించారట. ఈ సందర్భంగా మొత్తం వ్యవహారంపై ఓ సమగ్ర నివేదిక సమర్పించాలంటూ దినేశ్ కుమార్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారట. తన వైపు నుంచి కూడా ఓ నివేదిక ఇస్తానని చెప్పిన జీవీ రెడ్డి… అందుకు రెండు రోజుల గడువు కావాలని కోరారట. జరిగిందేదో జరిగిపోయింది… ఇకపై అంతా జాగ్రత్తగా వ్యవహరించాలని. రచ్చరచ్చ కుదరదని జీవీ రెడ్డి, దినేశ్ కుమార్ లకు మంత్రి ఒకింత గట్టిగానే చెప్పారట.
This post was last modified on February 22, 2025 11:04 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…