తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓ కోర్టు విచారణకు హాజరయ్యారు. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు కోర్టు విచారణలకు హాజరయ్యే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు. ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నామని, విచారణకు తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉంటారు. అందుకు కోర్టులు కూడా సరేనంటూ అనుమతి ఇస్తూ ఉంటాయి కూడా. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. రేవంత్ విచారణకు హాజరు కాగా… న్యాయమూర్తి సదరు కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. దీంతో రేవంత్ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగానూ రేవంత్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోనుందని టీపీసీసీ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్, నల్లగొండల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా రేవంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. గత విచారణ సందర్భంగా రేవంత్ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం రేవంత్ నేరుగా నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వచ్చారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. సీఎం కోర్టు విచారణకు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం… అక్కడి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణకు రేవంత్, ఉత్తమ్ హాజరయ్యారు. విచారణను కోర్టు వాయిదా వేయడంతో స్వల్ప వ్యవధిలోనే రేవంత్ అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. సీఎం హోదాలో ఉండి… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే వీలు ఉండి కూడా వాటినేమీ వినియోగించుకోకుండా రేవంత్ కోర్టు విచారణకు హాజరు కావడం గమనార్హం.
This post was last modified on February 21, 2025 2:20 pm
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…