మరో రెండు మాసాల్లో(మే నుంచి) వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నీటి అవసరం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో సాగు, తాగు నీటికి ఎద్దడి మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ముందుగానే అలర్టు కావడం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరింత దూకుడుగా ఉన్నారు. అవసరమైతే.. ఏపీతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఇదే జరిగితే.. ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య జల జగడం మరింత పెరగనుంది.
కేంద్రంలో కూటమిగా ఉన్న టీడీపీ సర్కారుకు.. జలాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందన్న వాదన ఆది నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చే వేసవిలో నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లకు విశేష అధికారాలు ఇచ్చారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల విషయంలో ఏపీతో కఠినంగా వ్యవహరించాలని చెప్పడం ద్వారా.. ఏపీ సీఎం చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయంపైనైనా పోరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పకనే చెప్పారు.
టెలిమెట్రీకి సై!
వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత జల వివాదాలు కొత్త కాదు. గతంలో కేసీఆర్, జగన్‌ల మధ్య రాజకీయంగా అవగాహన ఉన్నప్పటికీ.. జలాల విషయంలో వారు రాజీపడని ధోరణిలోనే ముందుకు సాగారు. ఇక, ఇప్పుడు చంద్రబాబుకు.. రేవంత్ కావాల్సిన మనిషే అయినా.. తన శిష్యుడేనని ఆయన భావించినా.. నీటి విషయంలో ఎక్కడా రాజీ ధోరణిలేకుండా రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న 3 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. తద్వారా.. చుక్కనీటిని కూడా వదులు కోకుండా..రేవంత్ వేస్తున్న వ్యూహానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఏం ఆశిస్తున్నారు?
This post was last modified on February 21, 2025 2:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…