ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందరికీ టార్గెట్ గా మారిపోతున్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్… కామారెడ్డిలో ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎంగా కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ముఖమే చూసింది లేదు. అధికార కాంగ్రెస్, మరో విపక్షం బీజేపీ ఎంతగా వేడుకుంటున్నా కూడా కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కడం లేదు. అసెంబ్లీలో కేసీఆర్ లేని లోటును ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావులు పూరిస్తున్నా… కేసీఆర్ ఇంకెంత కాలం అసెంబ్లీకి దూరంగా ఉంటారన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించే దిశగా చర్యలు చేపట్టాలంటూ ఏకంగా తెలంగాణ హైకోర్టుకు ఓ అభ్యర్థన వచ్చింది. ఫార్మర్స్ ఫెడరేషన్ పేరిట ఏర్పాటైన ఓ సంస్థ ప్రతినిధి విజయపాల్ రెడ్డి… ఈ మేరకు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో విజయపాల్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ ను అసెంబ్లీకి అయినా రప్పించండి… లేదంటే ఆయనపై సస్పెన్షన్ వేటు పడేలా అయినా ఆదేశాలు జారీ చేయండి అంటూ తన పిటిషన్ లో ఆయన కోర్టును కోరారు. అయినా ఏడాదికి పైగా కేసీఆర్ అసెంబ్లీ రాకుంటే… ఆయనపై చర్య తీసుకోవాలని స్పీకర్ కు ఎందుకు అనిపించలేదని కూడా రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా వేతనాలు తీసుకొంటున్న నేతలు… ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు.
విజయపాల్ రెడ్డి పిటిషన్ ను కోర్టు ఇంకా విచారణకు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఈ పిటిషన్ ను హైకోర్డు విచారణకు స్వీకరించినా… స్వీకరించకున్నా కూడా జనంలో నిగూఢంగా నానుతూ వస్తున్న అభిప్రాయాలను అయితే రెడ్డి తన పిటిషన్ ద్వారా బయటకు తీసుకువచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతసేపూ రాజకీయంగా పార్టీలను వృద్ధి చేసుకోవడంపైనే దృష్టి సారిస్తున్న నేతలు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రారన్న ప్రశ్నలు ఎంతోకాలంగా వినిపిస్తున్నవే. అంతేకాకుండా ప్రజా ప్రతినిధులుగా తమ వేతనాలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఆసక్తి చూపే నేతలు.. ప్రజా సమస్యలపై ఎందుకు దృష్టి సారించరన్న ప్రశ్నలూ చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. ఇన్నేసి ప్రశ్నలు… ఇన్నేసి మార్గాల్లో వినిపిస్తున్నా.. నేతలు ఎంతమాత్రమూ పట్టించుకోకుండా సాగుతున్న తీరును విజయపాల్ రెడ్డి తన పిటిషన్ ద్వారా మరోమారు చర్చకు వచ్చేలా చేశారని చెప్పక తప్పదు.
This post was last modified on February 21, 2025 10:18 am
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…