వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తడం గమనార్హం. ఇల్లీగల్ పనులు చేస్తాం.,..మాకు భద్రత ఇవ్వండి అంటే… ప్రభుత్వాలు వారికి భద్రత కల్పించాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రేపు రౌడీయిజం కూడా చేస్తాం,…మాకు భద్రత కల్పించండి అని అడుగుతారు?… అప్పుడు కూడా వారికి భద్రత కల్పిద్దామా? అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా జగన్ వ్యవహారం తన పరిధి కాదని చెప్పిన చంద్రబాబు.. జగన్ చేసిన పనిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని తెలిపారు. మీరు అడిగారు కాబట్టి నేను స్పందిస్తున్నానని తెలిపారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం తాను గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శిస్తానని జగన్ అంటే… ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు అనుమతి ఇవ్వబోమని ఎన్నికల సంఘం చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కూడా జగన్ ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్కచేయకుండా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ కు కనీస భద్రత కల్పించరా అంటూ వైసీపీ ఆరోపించింది. దీనిపై గవర్నర్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ అంశంపై గురువారం చంద్రబాబును స్పందన కోరగా…ఆయన వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసే వారికి ప్రభుత్వ భద్రత ఎలా లభిస్తుందని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా రౌడీయిజం చేస్తామంటే కుదరదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం వైసీపీ బాధ్యత అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అంటే… టీడీపీనో, బీజేపీనో, ఎన్డీఏనో పెట్టిన సంస్థ కాదని.. అదో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లుతుందంటే… అందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరుగుతున్న ఎన్నికలేనని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని కూడా చంద్రబాబు అన్నారు.
This post was last modified on February 20, 2025 8:51 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…