Political News

ఎన్నికల్లో పోటీ చేయకుంటే ‘కోడ్’ వర్తించదా…?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ఎప్పుడో అమలులోకి వచ్చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు పలు కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రులు సైతం… కోడ్ అమల్లోకి రాగానే తమ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ లను సర్దబాటు చేసుకున్నారు. కొన్ని కార్యక్రమాలను అయితే ఏకంగా రద్దు చేసుకున్నారు కూడా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే… రాజకీయ పార్టీలతో పాటు సామాన్యులు కూడా ఆ కోడ్ ను తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందే. అలా కాదని తామేమీ రాజకీయ పార్టీలకు చెందిన వారం కాదని, తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి… తమకు కోడ్ వర్తించదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించేస్తుంది కదా.

మరి ఈ విషయాలన్నీ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తెలియవని అనుకోవడానికి వీల్లేదు కదా. ఎందుకంటే… దాదాపుగా రాజ్యాంగం, న్యాయం, చట్టం, ధర్మం, సభా నియమాలు… ఇలా అన్నింటిపైనా లెక్చర్లు ఇచ్చే అంబటికి ఆ మాత్రం ఎన్నికల కోడ్ తెలియదంటే నమ్మెదెలా? నిజమే… ఎన్నికల కోడ్ గురించి అంబటికి సంపూర్ణంగా తెలుసు. అయితే ఇప్పుడు విపక్షంలో ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికల కోడ్ ను తనకు, తన పార్టీకి అనుకూలంగా మలచుకుని మరీ బరిలోకి దిగుతున్నారు. అబ్బే… ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయడం లేదు.. మాకు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుంది? అంటూ ఆయన చేస్తున్న తాజా వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల కోడ్ అంటే… ఎన్నికలు జరిగే ప్రాంతానికి వర్తిస్తుందా?.. లేదంటే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు మాత్రమే వర్తిస్తుందా? అన్న దానిపై ఇప్పుడు ఓ మోస్తరు చర్చకు అయితే తెర లేసింది.

అయినా ఈ దిశగా అంబటి ఎందుకు చర్చకు తెర లేపారంటే… బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కదా. అయితే ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది కదా. ఈ లెక్కన ఈ రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నట్టే కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే… ఓ పార్టీ ఓట్లకు గండి కొట్టే దిశగా మరో పార్టీ కార్యక్రమాలను చేపడతామంటే కుదరదు కదా. అందుకే… ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరు మిర్చి యార్డులో జగన్ రాజకీయ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమంటూ అధికారులు మంగళవారమే తెగేసి చెప్పారు. ఇదే విషయాన్ని వారు మైకుల్లో ప్రచారం కూడా చేశారు. అయితే తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి వైసీపీకి ఎన్నికల కోడ్ వర్తించదంటూ అంబటి వితంద వాదానికి దిగారు. అంతేకాకుండా కేవలం ఓ ఎమ్మెల్యేగా ఉన్న తమ నాయకుడు జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇచ్చే భద్రతను కల్పించి తీరాల్సిందేనని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం అంబటి డిమాండ్లు, సరికొత్త అర్థాలతో కూడిన ఎన్నికల కోడ్ నిబందనలపై సెటైర్లు పడుతున్నాయి.

This post was last modified on February 19, 2025 11:46 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కాకాణి దేశం దాటేసి వెళ్లిపోయారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…

15 minutes ago

జ‌గ‌న్ స‌తీమ‌ణిపై దుర్భాష‌లు.. టీడీపీ నేత‌పై బాబు క‌ఠిన చ‌ర్య‌లు

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. త‌న పార్టీవారిని కూడా వ‌దిలి…

32 minutes ago

పాత వాహనాలపై కొత్త నిబంధనలు.. లేదంటే కేసే!

మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…

49 minutes ago

పెద్ది అసలు కథ వేరే ఉంది

ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…

1 hour ago

పవన్ నిబద్ధతకు అద్దం పట్టిన ‘బాట’ వీడియో

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…

2 hours ago

బాషా ఫ్లాష్ బ్యాక్ : ముఖ్యమంత్రితో వివాదం

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…

2 hours ago