Political News

పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!: ర‌ఘురామ‌

“ఏం ర‌వి.. ఏం కోరుకుంటున్నావ్‌.. పులివెందుల‌కు ఉప ఎన్నిక రావాల‌ని మొక్కుకో!“ – ఇదీ.. ఉత్త‌ర‌ప్ర‌దే శ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ‌మేళాకు వెళ్లిన‌.. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ రాజు చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. టీడీపీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బీటెక్ ర‌విని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు! దీనిపై ర‌వి కూడా హ్యాపీగా ఫీల‌య్యారు. అంతేకాదు.. అదే ప‌రిస్థితి వ‌స్తే.. ర‌ఘురామే నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా రావాల‌ని ఆకాంక్షించ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది..?

మహాకుంభ‌మేళాకు.. ర‌ఘురామ‌కృష్ణ‌రావు, బీటెక్ ర‌వి, మంత్రి నారా లోకేష్ దంప‌తులు అదేవిధంగా సీఎం ర‌మేష్ స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.. నారా లోకేష్ దంప‌తులు వేరుగా.. యాత్ర‌ను కొన‌సాగించారు. ర‌ఘురామ‌, బీటెక్ ర‌వి ఒక బృందంగా ఏర్ప‌డ్డారు. వీరిరువు క‌లిసి ప్ర‌యాగ్ రాజ్‌లో ఈ రోజు ఉద‌యం స్నానం చేసి.. అక్క‌డే ఉన్న పురాత‌న మ‌ర్రి వృక్షానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ర‌ఘురామ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

పులివెందులకు ఉప ఎన్నిక రావాలని మొక్కుకో.. అని రఘురామకృష్ణ‌రాజు అన్నారు. దీనికి ప్ర‌తిగా.. స్పందించిన బీటెక్ ర‌వి.. `ఉప ఎన్నిక వస్తే మీరు ఇన్ఛార్జ్ గా రావాలి“ అని రఘురామను ఉద్దేశించి చెప్పారు. దీనికి అంగీక‌రించిన ర‌ఘురామ‌.. సాధ్య‌మైనంత వ‌ర‌కు పులివెందుల ఉప ఎన్నిక వ‌స్తుంద‌న్న ఉద్దేశం త‌న‌కు ఉంద‌న్నారు. కాగా.. ఈ వ్యాఖ్య‌లపై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. పులివెందుల ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ ర‌వికి విజ‌యాన్ని అందించే ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని.. కొంద‌రు వ్యాఖ్యా నించారు.

కానీ, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో పుణ్య‌స్నానానికి వెళ్లినా.. అక్క‌డా రాజ‌కీయాలేనా? అని పెద‌వి విరుస్తున్నారు. ఇదిలావుంటే.. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. సుదీర్ఘ కాలంగా ఇక్క‌డ వైఎస్ కుటుంబ‌మే విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ క్ర‌మంలో టీడీపీ ఈ ద‌ఫా అయినా విజయం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

This post was last modified on February 19, 2025 9:02 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

10 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago