ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవడం.. అనేక దేశాలు ఫాలో అవడం కూడా ఇటీవల కాలంలో తెరమీదికి వస్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్రశ్నగా మారింది. ప్రపంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావడం గమనార్హం. రెండు కీలక విషయాల్లో ప్రధాని ప్రధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మిత్రుడేనని మోడీ చెబుతారు.
ఇటీవల అమెరికాలోనూ పర్యటించి వచ్చారు. ట్రంప్ ఇచ్చిన విందును కూడా తీసుకున్నారు. కానుకలూ అందుకున్నారు. అయితే.. ఇదేసమయంలో భారత అక్రమ వలసదారుల విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మారలేదు. తాజాగా పంపించిన రెండు, మూడో విమానాల్లోనూ భారతీయులకు సంకెళ్లు వేసే పంపించారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా ఇంటా బయటా కూడా.. మోడీ కి సెగపెడుతు న్నాయి. చిన్న చిన్న దేశాలే.. తమ పౌరులను అవమానిస్తుంటే.. చూస్తూ ఊరుకోలేక పోతున్నాయి.
ఇటీవల కెన్యా దేశం.. తమ పౌరులను(వీరు కూడా అక్రమ వలసదారులే) అమెరికా యుద్ధ విమానంలో పంపడాన్ని తిరస్కరించింది. అంతేకాదు.. తమ గగనతలంలో అమెరికా విమానాలు ప్రయాణించేందుకు అనుమతి కూడా నిరాకరించింది. కెన్యాపౌరులు దొంగలు కారని స్పష్టం చేసిన ఆ దేశం.. గౌరవంగానే పంపించాలని ట్రంక్‌కు తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. తాజాగా తమపై సుంకాలు విధించడాన్ని తప్పు బడుతూ.. దక్షిణాఫ్రికా ఏకంగా అమెరికాతో వాణిజ్య సంబంధాన్ని కట్ చేసుకుంది.
This post was last modified on February 17, 2025 6:05 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…