“గన్నవరం నియోజకవర్గం నన్ను కాదనే వారు ఉన్నారా? నా పేరు చెబితే.. గ్రామాలకు గ్రామాలే తరలి వస్తాయి. ఏమనుకుంటున్నాడు వాడు(ప్రత్యర్థి నేత). ఒక్కసారి గన్నవరం గ్రౌండ్‌లోకి దిగితే.. తెలుస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. గన్నవరంలో ఏ పిల్లినడిడినా.. ఏ పిట్టనడిగినా.. వంశీ గురించి చెబుతారు. నాకు ఏమైనా జరిగితే.. గన్నవరం గన్నవరం మొత్తం నిలబడుతుంది“- ఖచ్చితంగా రెండేళ్ల కిందట అప్పటిఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి.
ప్రత్యర్థి పార్టీలోకి చేరిన.. అప్పటి వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఉద్దేశించి వంశీ చేసుకున్న నోరు అది!! కట్ చేస్తే.. ఆయన గత ఎన్నికల్లో ఇదేగన్నవరం ప్రజల చేతిలో ఓడిపోయారు. ఏదో కాకతాళీయంగా ఈ ఓటమి చేరువైందని అనుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే.. ఓడిన తర్వాత.. వంశీని పట్టించుకున్న వారు కరువయ్యారు. సో.. వంశీ ప్రగల్భం కేవలం మాటలేనని తేలిపో యింది. పోనీ.. ఇప్పుడు టీడీపీ నాయకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టు అయిన తర్వాతైనా వంశీ కి సానుభూతి వచ్చిందా? అనేది ప్రశ్న.
ఏ కోణంలో చూసుకున్నా.. వంశీకి సానుభూతి కరువైంది. ఆయన అరెస్టు.. 14 రోజుల రిమాండ్‌పై గన్నవరంలో ఒక్కరంటే ఒక్కరు కూడా “అయ్యో“ అన్న వారే లేకుండా పోయారు. మరీ ముఖ్యంగా తన అనుకున్న వైసీపీ నాయకులు కూడా ఎవరూ స్పందించలేదు. దీంతో నేరుగా జగనే స్పందించాల్సి వచ్చింది. వాస్తవానికి.. గతంలో వైసీపీ నాయకులు కొందరు అరెస్టయినప్పుడు.. చాలా మంది వారి వారి నియోజకవ ర్గాల్లో స్పందించారు. ప్రజల నుంచి కూడా అంతో ఇంతో సానుభూతి వ్యక్తమైంది.
కానీ, వంశీ విషయంలో ఎక్కడా ఎవరూ స్పందించలేదు. వంశీ అరెస్టుకు నిరసనగా ఎక్కడ ధర్నాకు పిలుపునివ్వలేదు. బంద్ కూడా పాటించలేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఇక, ఆయన సతీమణి పంకజ శ్రీ బయటకు వచ్చి.. మీడియ ముందు ఆవేదన వ్యక్తం చేసినా.. ఆమె పట్ల సానుభూతి ఉన్నప్పటికీ.. వంశీ విషయంలో ఎవరూ సానుభూతి కురిపించలేకపోయారు.
సో.. అధికారంలో ఉన్నప్పుడు.. ఏదో అనుకోవడం, నాఅంత వాడు లేడనిచెప్పడం కామనే. కానీ, ఇలాంటి సమయంలో అసలు ప్రజలనాడి తెలుస్తుంది. కాబట్టి.. వంశీ బలం .. అంతా టీడీపీదేనని.. ఆ పార్టీ అండతోనే ఆయన ఇన్నిసార్లుగా గెలిచారని ఆ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on February 17, 2025 5:37 pm
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…