ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ గుంటూరు జిజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం సాయంత్రం మరణించారు.
తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయినట్లుగా అనిపించడమే ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు కాళ్లు చచ్చుబడిపోయిన కమలమ్మను ఆమె కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు పరీక్షలు చేసి… కమలమ్మ జీబీఎస్ వ్యాదితో బాధపడుతున్నట్లుగా తేల్చారు. అందుకనుగుణంగా చికిత్స మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఆమె కోలుకున్నట్లుగానే కనిపించినా… గడచిన రెండు రోజులుగా ఆమె పరిస్థితి ఉన్నట్టుండి క్షీణించింది.
ఈ క్రమంలో కమలమ్మను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు… ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేక ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉంటే… ఈ వ్యాది కొత్తదే అయినప్పటికీ… అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇదేమీ అంటు వ్యాధి కూడా కాదని వారు చెబుతున్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.
This post was last modified on February 16, 2025 9:43 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…