ఆస్తులు కూడబెట్టే విషయంలో మనిషికి ఉండే ఆశ అంతా ఇంతా కాదు. తినటం.. తాగటం లాంటి విషయాలు ఒక మోతాదు దాటిన తర్వాత ఆగాల్సిందే. కానీ.. ఆస్తుల్ని కూడబెట్టే విషయంలో మాత్రం అంతుపొంతూ ఉండదు. ఎంత సంపాదించినా.. సంపద పోగేయాలన్న ఆశ చావదు. ఆ దాహం తీరనిది. అలా అని.. అంత సంపద పోగేసిన తర్వాత వెంట ఏమైనా తీసుకెళతారా? అంటే పైసా వెంట పెట్టుకు వెళ్లలేరు.
ఈ మాత్రం దానికి కిందా మీదా పడాలా? అంటే.. పడకుండా ఉండలేని నైజం ఎక్కువ మంది మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్తుల్ని తమిళనాడుకు కట్టబెట్టేస్తూ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు.. అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’ ఆస్తుల లెక్క మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ నటిగా.. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సొంతం చేసుకున్న జయలలిత అత్యున్నత పదవుల్ని సొంతం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్ని ఎదుర్కోవటమే కాదు.. ఆ కేసులో జైలుకు వెళ్లారు. నేరం నిరూపితమై దోషిగా నిలిచారు. ఆమె మరణం నేపథ్యంలో ఆమె సంపాదించిన ఆస్తులకు ఎవరు హక్కుదారు అన్న అంశంపై బెంగళూరు కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు వాటిని తమిళనాడుకు అప్పగించేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
ఇంతకాలం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో దాచిన జయలలిత ఆస్తుల్ని.. తాజాగా తమిళనాడుకు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె ఆస్తుల లెక్క మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 10 వేల చీరలు.. 750 జతల చెప్పులు.. 27 కేజీల బంగారం.. వజ్రాభరణాలు.. రత్నాలు.. 601 కేజీల వెండి వస్తువులు.. 1672 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన పత్రాలు.. ఇళ్లకు సంబంధించిన దస్తావేజులు.. 8376 పుస్తకాలతో పాటు ఇతర వస్తువుల్ని తమిళనాడు అధికారులకు అప్పజెప్పారు.
ఇందుకోసం భారీ భద్రతను కల్పించారు. న్యాయమూర్తి హెచ్ ఎన్ మోహన్ సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పజెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జప్తు చేసిన జయలలిత సంపదను 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకు తీసుకొచ్చి ఈ జైలులో భద్రపరిచారు. జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులకు తాము వారసులమని.. ఆస్తుల్ని తమకు అప్పగించాలని దీపక్.. దీపలు దాఖలు చేసుకున్న అర్జీలను హైకోర్టు కొట్టేయటం తెలిసిందే.
అనంతరం సుప్రీంను ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది.అప్పట్లో జయలలిత నుంచి జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.913.14 కోట్లుగా మదింపు వేయగా.. అదిప్పుడు రూ.4వేల కోట్లకు పైనే ఉంటుందని లెక్కలు కడుతున్నారు. సంపద కోసం అతిగా ఆశపడే వారికి.. జయలలిత ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని మాత్రం చెప్పక తప్పదు.
This post was last modified on February 15, 2025 11:33 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…