Political News

మోదీ కులంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా బీసీ జన గణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన సమావేశంలో మాట్లాడిన సందర్బంగా మోదీ కులాన్ని ప్రస్తావించిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మోదీపై ఏ ఒక్కరు చేయనంత స్థాయిలో రేవంత్ విమర్శలు గుప్పించిన తీరు కలకలం రేపుతోంది. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలతో రానున్న కొద్ది రోజుల పాటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజీలో నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.

అయినా ప్రధాని మోదీ గురించి రేవంత్ ఎమన్నారన్న విషయానికి వస్తే… ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను బీసీ అని చెప్పుకుంటారని రేవంత్ అన్నారు. అయితే వాస్తవానికి మోదీ నిజమైన బీసీ కాదని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ”నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు మోదీ ఉన్నత వర్గాలకు చెందిన వారే. గుజరాత్ సీఎం అయ్యాక మోదీ తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నారు. మోదీకి బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు గానీ… మోదీ మనస్తత్వం మాత్రం బీసీలకు వ్యతిరేకం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

మోదీని నేరుగానే టార్గెట్ చేసిన రేవంత్.. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..,. మోదీ నిజమైన బీసీనే అయితే 2021లో దేశంలో జనాభా లెక్కలు ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. దేశంలో బీసీల లెక్క ఎందుకు తేల్చలేదని కూడా రేవంత్ నిలదీశారు. మోదీని అగ్రవర్ణాలకు చెందిన నేతగానే తేల్చేసిన రేవంత్…మోదీ పాలనలో బీసీలకు న్యాయమేమీ జరగడం లేదని ఆరోపించారు. మోదీ లాంటి నేతలు ఉన్నంత కాలం కూడా బీసీలకు న్యాయం దక్కదని కూడా రేవంత్ సెటైరికల్ పంచ్ లు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను కలకలమే రేపనున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on February 15, 2025 6:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

1 hour ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

5 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

5 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

7 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

9 hours ago