దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5ననే వెలువడ్డాయి. అయితే ఇంకా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట నుంచి కార్యకలాపాలు సాగించే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి దక్కిన నేపథ్యంలో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా ఆశించారు. అయితే ఢిల్లీ సీఎం పోస్టుకు పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కట్టడంతో బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం కోసం కొంత సమయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మోదీ ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం, మంత్రి మండలి, అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు ఉండాలన్న దానిపై ఓ కసరత్తు అయితే చేసిందట. సీఎం పోస్టుకు మొత్తంగా 15 మంది అభ్యర్థులతో ఓ జాబితాను సిద్ధం చేసిన షా, నడ్డాలు… దానిని 9 మంది పేర్లతో కూడిన షార్ట్ లిస్ట్ రెడీ చేశారట. ఈ 9 మందిలోనే డిల్లీ సీఎం పోస్టును అదిరోహించే లక్కీలీడర్ తో పాటుగా అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ లో కీలక పోర్ట్ ఫోలియోల మంత్రులను ఖరారు చేస్తారట.
మోదీ శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోగానే… శనివారం ఉదయమే ఢిల్లీ సర్కారు కూర్పుపై అంతిమ కసరత్తు మొదలు కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా శనివారమే తుది కసరత్తు పూర్తి చేసి… ఈ నెల 17, 18 తేదీల్లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని అథిష్టానం దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 19 లేదంటే… 20న ఢిల్లీ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా నిర్ణయించారట. మరి ఆ 9 మందిలోని లక్కీ లీడర్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 14, 2025 4:18 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…