Political News

‘వంశీ’ ఇలాంటి వాడా.. పోలీసులు ఏమ‌న్నారంటే!

తాజాగా 14 రోజ‌లు రిమాండ్ ప‌డ్డ వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను పోలీసులు త‌మ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విష‌యాలు తెలిస్తే.. “వంశీ ఇలాంటి వాడా” అని అన‌కుండా ఎవ‌రూ ఉండ‌లేరు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిపై పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతోపాటు కోర్ట‌లో కేసు వేసిన‌.. స‌త్య‌వ‌ర్థ‌న్‌ను వంశీ ఆయ‌న అనుచరులు ఎంత‌గా వేధించారో.. ఎలాంటి శిక్షలు విధించారో పోలీసులు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు రిపోర్టులో పేర్కొన్నారు.

ఈ కేసులోనే వంశీకి విజ‌య‌వాడ స్థానిక కోర్టు14 రోజుల పాటు రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. ఇక పోలీసులు ఇచ్చిన నివేదిక‌లోని అంశాల విష‌యానికి వ‌స్తే.. త‌మ‌పై కేసు పెట్టిన స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను తీవ్రంగా హించార‌ని పోలీసులు తెలిపారు. వంశీ స‌హా ఆయన ప్రధాన అనుచరులు ఒక రాత్రంతా బ‌ట్టలు ఊడ‌దీసి.. నిగ్నంగా నిల‌బెట్టి చిత్రహింసలు పెట్టారని స‌త్య‌వ‌ర్ధ‌న్ త‌మ‌కు చెప్పిన‌ట్టు పోలీసులు తెలిపారు. ప‌దే ప‌దే.. బండ బూతులు తిడుతూ.. మాన‌సికంగా వేధించార‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. స‌త్య‌వ‌ర్ధ‌న్ త‌మ మాట వినేలా.. అతని మ‌ర్మాయ‌వాల‌పై తన్నారని పోలీసులు రిపోర్టులో స్ప‌ష్టం చేశారు. “మా మీదే కేసు పెట్టే మొగోడివా” అంటూ.. స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను విజయవాడ నుంచి అపహరించి, భయపెట్టి, బెదిరించి..కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారు. అంతేకాదు.. స‌ద‌రు కేసును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టుగా తామే ఓ అఫిడ‌విట్‌ను రూపొందించి.. దానిపై స‌త్య‌వ‌ర్థ‌న్‌తో బ‌ల‌వంతంగా సంత‌కం తీసుకున్నార‌ని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

అంతేకాదు.. వంశీ అరాచాకల జాబితాలో సత్యవర్ధన్‌ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించిన విష‌యం కూడా వెలుగు చూసింది. విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రి వద్ద పొట్టి రాము అనే వ్యక్తిని కలవాలంటూ సత్యవర్ధన్‌పై వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు ఒత్తిడి తీసుకొచ్చార‌ని, వంశీ ప్రోద్బలం, ప్రేరేపణతోనే ప‌క్కా క్ర‌మిన‌ల్ ప్లాన్‌తో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన‌ట్టు పోలీసులు వివ‌రించారు.

“ఆ రోజు రాత్రంతా స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను చిత్రహింసలు పెట్టారు. త‌మ మాట విన‌కుంటే.. చంపేయాలనుకున్నారు. విశాఖపట్నం తీసుకువెళ్లి.. ఓ ఫ్లాట్‌లో ఉంచారు. అక్క‌డి నుంచే క‌థంతా న‌డిపించారు” అని పోలీసులు పేర్కొన్నారు. ఈ విష‌యాలు వెలుగు చూడ‌డంతో గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వంశీ అంటే.. మంచి నాయ‌కుడ‌ని అనుకున్నామ‌ని.. కానీ, ఇంత ఘోరానికి ఒడిగ‌ట్టే క్రిమిన‌ల్ మెంటాలిటీ ఉంటుందని భావించ‌లేద‌ని లోక‌ల్ చానెళ్ల‌తో వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 14, 2025 12:15 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago