ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏఐ జపాన్ని పఠిస్తున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతుంటే…
ఇప్పటికే ఐటీ పరంగా ఓ రేంజి అభివృద్ధి సాధించిన తెలంగాణ రాజధానిని ఇకపై ఏఐకి కేంద్రంగా మలుస్తామని ఆ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఐ ఆదారిత పరిశ్రమలు, పెట్టుబడులు భారీగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏఐ రంగంలో ఐటీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లు త్వరలోనే హైదరాబాద్ లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ రెండు సంస్థలు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ తన నూతన క్యాంపస్ ను ప్రారంభించింది.
తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకోసం రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా ఫెట్టనున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ… ఆ మేరకు తెలంగాణ సర్కారుతో కీలక ఓప్పందాన్ని కుదుర్చుకుంది.
ఆ తర్వాత టీ హబ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులు వారితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు కానున్న ఏఐ సిటీలో గూగుల్ తరఫున ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
అంతేకాకుండా అంతకుముందు జరిగిన చర్చల ఫలితంగా రూపొందిన ఒప్పంద పత్రాలపై గూగుల్ ప్రతినిధులు, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు. వెరసి ఒకే రోజు అటు మక్రోసాఫ్ట్ తో పాటు ఇటు గూగుల్ తోనూ ఏఐ సిటీలో ఆయా సంస్థల కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా తెలంగాణ సర్కారు రెండు కీలక ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు కేంద్రాలు కూడా వివిధ రంగాలకు చెందిన వారికి ఏఐలో శిక్షణను ఇవ్వనున్నాయి.
This post was last modified on February 13, 2025 4:57 pm
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ... లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్…
కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల…
గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…