వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు కొందరు కీలక నేతలు పార్టీని వీడితే… ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత మరింత మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా ఇప్పుడు పార్టీకి మంచి పట్టు ఉన్న పల్నాడు జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడే దిశగా సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మర్రి రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా ఆయన సన్నిహితుడిగానే మెలిగారు. ఈ క్రమంలోనే వైసీపీని స్థాపించినంతనే కాంగ్రెస్ ను వీడిన మర్రి… జగన్ వెంట నడిచారు. అయితే ఆది నుంచి కూడా మర్రికి జగన్ పెద్దగా ప్రాదాన్యమే ఇవ్వలేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు రావడం, మర్రి సొంతూరు అయిన చిలకలూరిపేట టికెట్ ను ఎగురవేసుకు పోవడం జరుగుతోంది. మాజీ మంత్రి విడదట రజిని కూడా మర్రిని ఓవర్ టేక్ చేసి చిలకలూరిపేట టికెట్ ను దక్కించుకున్నారు. అయినా కూడా మర్రి పార్టీని వీడలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు మర్రికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
తాజాగా 2024 ఎన్నికల్లో రజినిని గుంటూరుకు షిప్ట్ చేసిన జగన్… ఎన్నికలు ముగియగానే.. తిరిగి ఆమెను చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్బంగా మర్రికి మాట మాత్రంగా కూడా చెప్పలేదట. అంతేకాకుండా రజిని కూడా మర్రిని పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదని సమాచారం. దీంతో ఇలాగైతే కుదరదని భావిస్తున్న మర్రి… పార్టీని వీడాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ కారణంగానే బుధవారం జగన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పార్టీ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టేశారట. ఈ సమావేశానికి పల్నాడుతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల నేతలంతా వచ్చినా కూడా మర్రి జాడ మాత్రం కనిపించలేదు. ఎన్నాళ్లు పార్టీలో ఉన్నా.. తనకు తగిన గుర్తింపు లభించడం లేదని భావిస్తున్న మర్రి… వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన జగన్ భేటీకి డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 12, 2025 10:03 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…