జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి నగరానికి చెందిన ఓ వివాహితతో రాయల్ వివాహేతర బంధం నెరపారని, ఆమె నుంచి భారీ ఎత్తున డబ్బు, నగలు తీసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో తానే బాధితురాలిని అంటూ స్వయంగా లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి… రాయల్ ను వివాదంలోకి లాగేసింది. దీంతో రాయల్ ను కొంతకాలం పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ జనసేన అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కిరణ్ రాయల్ పై వైసీపీ ఓ రేంజిలో విరుచుకుపడుతూ ఉంటే.. మంగళవారం లక్ష్మీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ లోని జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారని, ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి ప్రెస్ క్లబ్ సమీపంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను జైపూర్ తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎప్పుడో 2021లో నమోదైన కేసులో లక్ష్మి నిందితురాలిగా ఉన్నారని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదని, తాజాగా మీడియాలో ఆమె కనిపించడంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు జైపూర్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే… బుధవారం సాయంత్రం జైపూర్ కోర్టు లక్ష్మికి బెయిల్ మంజూరు చేసింది. ఓ చెక్ బౌన్స్ కు సంబంధించిన కేసు కావడంతో లక్ష్మి ఇలా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగానే… దానిపై విచారణ చేపట్టిన కోర్టు… అలా బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సబ్ జైలులో ఉన్న ఆమె… కోర్టు ఉత్తర్వులు అందగానే… ఆ ఉత్తర్వుల ప్రకారం న్యాయమూర్తి నిర్దేశించిన షరతుల మేర జామీను సమర్పించి జైలు నుంచి విడుదల కానున్నారు. అంటే… లక్ష్మి ఈ కేసులో ఒక్క రోజు కూడా పూర్తిగా జైలులో ఉండలేదన్న మాట. అయినా ఈ వ్యవహారం మాదిరే లక్ష్మి అరెస్ట్, బెయిల్ కూడా వెంటవెంటనే జరిగిపోవడం గమనార్హం.
This post was last modified on February 12, 2025 6:13 pm
ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో…
టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో…