Political News

బిహార్ ఎన్నికల బరిలో అంతమంది క్రిమినల్సా?

బిహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఏ పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూసినప్పుడు షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. తొలిదశలో బరిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 1064 మంది అభ్యర్థుల్లో ఏకంగా 328 మంది మీద క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. అంతేకాదు.. వీరిలో 56 మంది మీద ఐదేళ్లు.. అంతకంటే ఎక్కువ జైలుశిక్ష్ పడే అవకాశం ఉన్న నాన్ బెయిలబుల్ కేసులు ఉండటం గమనార్హం.

నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను మదింపు చేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన అన్ని వివరాల్నిపొందుపర్చింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం అభ్యర్థుల్లో 29 మంది మీద మహిళల్ని వేధింపులకు గురి చేసిన కేసులు.. ముగ్గురుపై అత్యాచార కేసులు కూడా ఉండటం గమనార్హం.

ఇక.. హత్య నేర ఆరోపణలు ఉన్న వారు 21 మంది కాగా.. హత్యాయత్నం కేసులునమోదైన వారు 62 మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నేరస్తులకుటికెట్లు ఇవ్వకూడదన్న మాటను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. మైకుల ముందుకు వచ్చినప్పుడు నీతులు చెప్పే నేతలు కానీ వారి పార్టీలు కానీ గెలుపు అంశాల్ని మాత్రమే చూశాయే తప్పించి.. విలువల ఆధారంగా అభ్యర్థుల్నిఎంపిక చేయలేదన్న భావన కలుగక మానదు.

ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి నేరారోపణ ఉన్న అభ్యర్థుల లెక్కల్నిచూస్తే.. అందరికంటే ఎక్కువ కేసులున్న అభ్యర్థులు ఆర్జేడీలో ఉన్నారు. ఈ పార్టీతరఫున మొత్తం 52 మంది పోటీ చేస్తుంటే.. అందులో క్రిమినల్ కేసులు ఉన్న వారు 30 మంది.. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు 22 మంది ఉన్నారు.

ఆర్జేడీ తర్వాత ఆ తరహాలో నేర చరిత ఉన్న అభ్యర్థులు ఎల్జేపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 24 మందిపైక్రిమినల్ కేసులు.. 20 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మూడో స్థానంలో బీజేపీ నిలిచింది.ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు ఉంటే.. 13 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఉన్నారు. తర్వాతి స్థానంలో అధికార జేడీయూ అభ్యర్థులు ఉన్నారు. 25మందిక్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కేసులు ఉన్నావారే. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలిచారు. మొత్తం 21 మంది క్రిమినల్స్ అభ్యర్థులుగా తేల్చారు. చివరిస్థానంలో బీఎస్పీ అభ్యర్థులు నిలిచారు. ప్రస్తుతం బరిలో ఉన్న వారిలో 13 మందిపై క్రిమినల్ రికార్డు ఉన్నట్లుగా గుర్తించారు.

This post was last modified on October 21, 2020 3:32 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

5 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

6 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

7 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

9 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

10 hours ago