Political News

జ‌మిలి ప‌క్కా.. రాసిపెట్టుకోవ‌చ్చు!

దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయా? జ‌ర‌గవా? ఈ విష‌యంలో బీజేపీ అడుగులు ముందుకు ప‌డ‌తాయా? ప‌డ‌వా? అనే సందేహాలు త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. కానీ, మ‌రోవైపు జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. పార్ల‌మెంటులోనూ ప్ర‌వేశ పెట్టారు. దీనిపై ప్ర‌త్యేకంగా ఆరు మాసాల పాటు అధ్య‌యనం కూడా జ‌రిగిపోయింది. అయినా.. ఈ సందేహాలు మాత్రం కొన‌సాగాయి. దీనికి కార‌ణం.. బీజేపీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్లు తెచ్చుకున్న ద‌రిమిలా.. వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌లే.

ముఖ్యంగా జార్ఖండ్‌, జ‌మ్ము క‌శ్మీర్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. దీంతో జ‌మిలి పై వెనుక‌డుగు త‌ప్ప‌ద‌న్న వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ, ఈ ఏడాది జ‌రిగిన ఢిల్లీ ఎన్నిక‌లు, ఇటీవ‌ల జ‌రి గిన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ.. బీజేపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. మ‌రీ ముఖ్యంగా దే శ‌రాజ‌ధానిలో 27 ఏళ్ల త‌ర్వాత‌.. క‌మ‌ల వికాసం క‌నిపించింది. దీంతో పార్టీ పుంజుకుంది. ఇక‌, తిరుగులేద‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మైంది. దీంతో జ‌మిలి ఎన్నిక‌ల‌కు మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే.. పంజాబ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, జార్ఖండ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, జ‌మ్ము క‌శ్మీర్‌, ప‌శ్చిమ బెంగాల్ మిన‌హా.. ఇత‌ర రాష్ట్రాల్లో.. బీజేపీ పూర్తిగా లేదా ఎన్డీయే కూట‌మితో అధికారంలోకి వ‌చ్చింది. జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఈ రాష్ట్రాలు మ‌ద్ద‌తు ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా.. త‌మ‌కు బేఫిక‌ర్‌. సో.. బీజేపీ అనుకున్న‌ది సాధించేందుకు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల మ‌ద్ద‌తు చాలు. దీనికి తోడు.. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ.. ప్ర‌తిప‌క్షాల ప‌ట్టు బీజేపీ వైపు ఉంది.

సో.. ఎలా చూసుకున్నా జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ రెడీ కావ‌డం ప‌క్కా అని తేలిపోయింద‌ని.. ముహూర్త‌మే త‌రువాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీముఖ్యంగా ఢిల్లీలో విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. బీజేపీకి తిరుగులేకుండా పోయింద‌న్న వాద‌న‌ కూడా బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 25, 2025 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విక్రమ్ సినిమాకు ఇలాంటి పరిస్థితా

ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…

16 minutes ago

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి…

18 minutes ago

జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు ప‌క్షులు!

వైసీపీ త‌ర‌ఫున గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. పార్టీని, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేస‌మ‌యంలో అప్ప‌టి…

2 hours ago

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…

2 hours ago

వాయిదాల వ్యూహంలో యువి క్రియేషన్స్

ప్రభాస్ కు అత్యంత సన్నిహితమైన బ్యానర్ గా ఇంకా చెప్పాలంటే అతని స్వంత సంస్థలా ఇండస్ట్రీ భావించే యువి క్రియేషన్స్…

4 hours ago

వైఎస్ అవినాశ్ ఇరుక్కుపోయినట్టేనా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక…

4 hours ago