Political News

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి న్నంగా ఉంటుంద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు అగ్ర‌తాంబూలం ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్టుకుంటాన‌ని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జ‌గ‌న్ 2.0పై వైసీపీలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇది న‌మ్మ శ‌క్యంగా లేద‌నికొంద‌రు అప్పుడే పెద‌వివిరుస్తుండ‌గా.. మ‌రికొంద‌రు నాయ‌కులు మాత్రం 2.0 బాగానే ఉంటుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో కార్య‌క‌ర్త‌ల‌ను విస్మ‌రించార‌న్న అప‌ప్ర‌ద జ‌గ‌న్‌పై ఉంది. కేవ‌లం వలంటీర్ల‌ను మాత్ర‌మే న‌మ్ముకుని.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌క్క‌న పెట్టార‌న్న చ‌ర్చ‌సాగింది. ఇది పార్టీని భారీ ప‌త‌నానికి చేర్చింద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ 2.0లో కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదురు కానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిస్తే.. అప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ద‌క్కుతుంది.

అంటే.. వ‌చ్చే నాలుగేళ్ల‌పాటు పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల్సి ఉంటుంది. కూట‌మి స‌ర్కారుకు వ్య‌తిరేకం గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. కానీ, ఇది సాధ్యం కాక‌పొవ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం వైసీపీ త‌ర‌ఫున గ‌ళం వినిపించేవారే లేకుండా పోయిన‌ద‌రిమిలా.. పార్టీని కాపాడు కునేందుకు జ‌గ‌న్ వేసిన ఎత్తుగ‌డ‌గా కొంద‌రు భావిస్తున్నారు. ఇక్క‌డ కీల‌క విష‌యం పార్టీ కార్య‌క‌ర్త‌లు.. కేసులు పెట్టించుకునేందుకు సిద్ధంగా అయితే లేరు. ఇప్ప‌టికే జైళ్ల‌లో ఉన్న‌వారికి పార్టీ నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు.

ఇక‌, ఇప్పుడు కొత్త‌గా కేసులు పెట్టించుకుంటే.. ఆ ప‌రిస్థితి మ‌రో రేంజ్‌లో ఉంటుంది. ఇక‌, జ‌గ‌న్ 2.0 భి న్నంగా ఉంటుంద‌ని చెప్ప‌డం వెనుక‌.. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా ర‌న్న‌ది మ‌రో టాక్‌. కీల‌క నేత‌లు ఇప్ప‌టికే పార్టీ మారిన ద‌రిమిలా.. మున్ముందు.. ఎవ‌రూ వెళ్ల‌కుండా చేసే ప్ర‌క్రియలో ఇది ప‌రాకాష్ట‌గా పేర్కొంటున్నారు. ఎలా చూసుకున్నా.. వ‌చ్చే నాలుగేళ్లు మాత్రం వైసీపీకి పోరాటాలు త‌ప్ప‌.. ఆరాటం పనిచేసే అవ‌కాశం లేదు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధినేత కార్య‌క‌ర్త‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 25, 2025 11:34 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

21 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago