నిషేధిత మావోయిస్టులకు నిజంగానే చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని మరింతగా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఎన్ కౌంటర్ లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏకంగా 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. వెరసి ఈ ఘటనలో మొత్తం 33 మంది చనిపోయినట్టు అయ్యింది.
ఛత్తీస్ గఢ్ లో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రవతి నేషనల్ పార్క్ అడవుల్లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒకే ఎన్ కౌంటర్ లో ఇంత మంది చనిపోవడం మావోయిస్టులకు చావు దెబ్బగానే పరిగణించాలి. గతంలో ఒకే ఎన్ కౌంటర్ లో అత్యధికంగా 40 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజా ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు చనిపోవడంతో ఆ పార్టీకి ఇది రెండో అతిపెద్ద నష్టమని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈ ఎదురు కాల్పుల్లో భద్రత బలగాలకు కూడా ఓ మోస్తరు నష్టం జరిగింది. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. మరికొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో పలువురు తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వెరసి ఈ కాల్పుల్లో మొత్తంగా 33 మంది చనిపోయినట్టు అయ్యింది. కాల్పుల అనంతరం అక్కడ మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సోదాలు చేస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్యమరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
This post was last modified on February 9, 2025 3:38 pm
ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోడీ.. పట్టుబట్టారంటే.. కమల వికాసం జరగాల్సిందే. దీనికి సహకరించేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా…
కొత్త సినిమాలకు హిట్ టాక్ వస్తే నిర్మాతలు ఆనందిస్తుండగానే గంటల వ్యవధిలో పైరసీ బారిన పడిందనే వార్త వాళ్ళను ఆందోళనకు…
ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న 'బ్రహ్మ ఆనందం' టైటిల్ కు తగ్గట్టు కేవలం బ్రహ్మానందం పేరు మీదే మార్కెటింగ్ చేసుకుంటోంది.…
పాకిస్తాన్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం మరోసారి వివాదాస్పదంగా మారింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకి తీవ్ర గాయం కావడం, ఆ…
ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలిచాక ప్రపంచమంతా టాలీవుడ్ వైపు దృష్టి పెడుతోంది. ఇది కేవలం రాజమౌళికి…
నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన తండేల్ మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది, యూనిట్ అధికారికంగా…