యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 48 సీట్లల్లో గెలిచింది. వెరసి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని తిరిగి దక్కించుకుంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నట్టుగా కేటీఆర్ సెటైర్ సంధించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ పోస్టును సంధించారు. బీజేపీని మరోమారు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ సదరు పోస్టులో పేర్కొనడం గమనార్హం.
వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆప్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. అయితే.. ఎందుకనో గాని ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ పరిణామమే ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అబ్భిప్రాయం. ఇదే వాదనను వినిపించిన కేటీఆర్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీకి రాహుల్ గాంధీ కారణమయ్యారని సెటైర్ సంధించారు. ఈ లెక్కన కేటీఆర్ సెటైరిక్ గా చెప్పినా అదే నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 8, 2025 2:36 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…