క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున గెలిచిన వారిలో మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చాలా దూకుడు మీదుండే వ్యక్తి. దశాబ్దాల పాటు కింజరాపు కుటుంబానికి శ్రీకాకుళం జిల్లాలో ఎదురులేకపోవటం వల్లే అచ్చెన్నకు జిల్లా వ్యాప్తంగా పట్టువచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కింజరాపు కుటుంబానికైతే ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయట్లుందిపుడు.
ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత అచ్చెన్న గెలిచిన టెక్కలి నియోజకవర్గంలో దువ్వాల శ్రీనివాస్ ఇన్చార్జిగా ఉన్నారు. దువ్వాడ మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపిగా పోటిచేసి ఓడిపోయారు. ఎప్పుడైతే వైసీపీ అఖండ మెజారిటితో గెలిచిందో అప్పటి నుండో దువ్వాడ హవా కూడా మొదలైది. అసలే జగన్మోహన్ రెడ్డికి దువ్వాడ చాలా సన్నిహితుడు. దానికితోడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దువ్వాడకు తిరుగేముంటుంది ? అందుకనే టెక్కలిలో ఎంఎల్ఏ హోదాలో దువ్వాడే చక్రం తిప్పేస్తున్నారట.
నియోజకవర్గంలోని సమస్త పనులు దువ్వాడ పేరుమీద జరుగుతున్నాయని సమాచారం. టెక్కలిలో అధికారుల సమీక్షలు కూడా దువ్వాడ చూసుకుంటున్నారట. దాంతో అచ్చెన్న పేరుకు మాత్రమే ఎంఎల్ఏగా మిగిలిపోయారు. అచ్చెన్న సమీక్షలకు పిలుస్తున్నా అధికారులు పెద్దగా హాజరుకావటం లేదట. ఎందుకంటే ఈ పద్దతిని మొదలుపెట్టిందే టీడీపీ. 2014-19లో జిల్లాలో గెలిచిన వైసీపీ ఎంఎల్ఏలను అచ్చెన్న పూచికపుల్లలుగా చూశారట. టెక్కలిలో మాత్రమే కాదులేండి రాష్ట్రంలో అన్నీ చోట్లా ఇలాగే జరిగింది. ఎంఎల్ఏలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా చంద్రబాబు ఓడిపోయిన నేతల పేర్లతోనే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.
సరే దువ్వాడ విషయమే ఇలాగుంటే అచ్చెన్నపైన మరో పిడుగు పడినట్లయ్యింది. అదేమిటంటే పోయిన ఎన్నికల్లో అచ్చెన్న మీద పోటి చేసిన ఓడిపోయిన పేరాడ తిలక్ ను కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. పేరాడ కూడా జగన్ కు బాగా సన్నిహితుడనే చెప్పాలి. అంటే ఒకే నియోజకవర్గంలో జగన్ కు బాగా సన్నిహితులైన దువ్వాడ, పేరాడలకు ప్రమోషన్ వచ్చినట్లే అయ్యింది. దాంతో దువ్వాడ ఒక్కరితోనే వేగలేక నానా అవస్తలు పడుతున్న అచ్చెన్నకు తాజాగా పేరాడ కూడా జత కలిసినట్లయ్యింది. పైగా జిల్లాలో ప్రముఖ సామాజికవర్గమైన కళింగ కార్పొరేషన్ కు క్యాబినెట్ ర్యాంకుతో ఛైర్మన్ గా నియమించటమంటే చాలా ప్రాధాన్యత దక్కినట్లే పేరాడకు. మరి మిగిలిన మూడున్నరేళ్ళు వీళ్ళద్దరితో అచ్చెన్న ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే.
This post was last modified on October 20, 2020 4:49 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…