అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా చేసుకుపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలియదు గానీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగ్ చాల ఫ్రెండ్లీగా ఉంటారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉండగా.. నేరుగా జైలుకి వెళ్లి మరీ నాగ్ ఆయనను పరామర్శించారు. నాడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. జగన్ తనకు మిత్రుడని… అలాగే జగన్ తో పాటు నాడు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా తనకు మిత్రుడని కూడా నాగ్ చెప్పుకొచ్చారు.
సీన్ కట్ చేస్తే… శుక్రవారం నాగ్ తన ఫామిలీ మెంబెర్స్ తో కలిసి టీడీపీ కార్యాలయంలో కనిపించారు. అది కూడా ఢిల్లీలోని పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నాగ్.. అక్కడ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను బైరెడ్డి శబరీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగ్ తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు శోభిత ఉన్నారు.
ఢిల్లీ లో అది కూడా పార్లమెంట్ లో…టీడీపీపీ కార్యాలయానికి నాగ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లడం, అక్కడ టీడీపీ ఎంపీ కనిపించగానే.. ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ తో స్నేహం ఉన్నా ఏనాడూ నాగ్ వైసీపీ ఆఫీస్ కి వెళ్లిన దాఖలా లేదు. అయితే… ఢిల్లీ వెళ్లిన నాగ్ ఇలా టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా.. నాగ్ తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆరా తీస్తే… తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుపై ఓ పుస్తకాన్నిఆవిష్కరించే కార్యక్రం ఉండటంతో… ఢిల్లీ వెళ్లిన నాగ్.. పనిలో పనిగా పలువురు రాజకీయ నేతలను కూడా కలిశారట. ఈ క్రమంలోనే.. నాగ్ ఆలా టీడీపీ ఆఫీస్ కి కూడా వెళ్లినట్టు సమాచారం.
This post was last modified on February 7, 2025 2:35 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…