అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని కట్టబెడుతుంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సరే.. ఏం చెబితే అదే వేదం. మరి.. పాలనాధికారం చేతిలో లేని వేళ.. అప్పటివరకు పాలనాధినేతగా వ్యవహరించిన అధినేత తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షం ఓటమి చెందటం.. విపక్షాలు విజయాన్ని సాధించిన పాలనా పగ్గాల్ని చేపట్టిన వైనం తెలిసిందే.
అయితే.. అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విపక్ష అధినేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలంటూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ కోరుతుంటారు. మీరు అసెంబ్లీకి రండి.. మీ సందేహాల్ని తీరుస్తామని పేర్కొన్నా.. ఆయన నుంచి ఎలాంటి సమాధానం ఉండకపోవటం తెలిసిందే. ఇంకోవైపు ఏపీ ప్రతిపక్ష నేత (ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లభించకపోవటం తెలిసిందే) కం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అసెంబ్లీకి హాజరు కాని వైనం తెలిసిందే.
అసెంబ్లీకి హాజరు కాకపోవటంపై తన నివసానికి ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులను పిలిచి మాట్లాడిన సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర సమాధానాల్ని ఇచ్చారు. తాను హాజరు కాకపోవటానికి సరికొత్త భాష్యాన్ని ఆయన చెబుతూ.. అసెంబ్లీని తాను బహిష్కరిస్తున్నాన్న అర్థం వచ్చేలా ఆయన సమాధానం ఉండటం గమనార్హం. ఎమ్మెల్యేలు ప్రజలకు చెుప్పదలచుకుంది అసెంబ్లీకే వెళ్లి చెప్పనవసరం లేదు. మీడియా ముందు చెబితే సరిపోదా? అన్నట్లుగా ఆయన సమాధానం ఉంది.
జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే చెప్పాల్సి వస్తే.. “మేం అసెంబ్లీని బహిష్కరిస్తున్నామనే దాని కంటే.. కోర్టు సమన్లకు స్పీకర్ ఎందుకు స్పందించటం లేదు? ఆయన స్పందిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సి వస్తుంది. మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మా డ్యూటీ ఏంది? ప్రజలకు సందేశాల్ని పంపటం. ఇలా మీ (మీడియాను ఉద్దేశించి) ద్వారా అయినా సత్యాలను ప్రజలకు చెప్పటం ప్రధానం. ఇవన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. మేం అడిగిన వాటికి వారిని సమాధానం చెప్పమనండి. ప్రజలు కోరుకుంటుంది అదే. నువ్వు.. నేను ఎదురెదురుగా కొట్టుకొని.. కుస్తీ పడాల్సిన పని లేదు. ఎదురెదురుగా ఉండాల్సిన పని లేదు” అంటూ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ముఖ్యమంత్రితో సమానంగా సభలో నాకు సమయం ఇవ్వాల్సి ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక మీడియా ప్రతినిధి.. ‘సభకు రాకపోతే అనర్హతకు గురవుతారంటున్నారు’ అని వ్యాఖ్యానించగా.. “వారికి బుద్ధి పుట్టింది చేసుకోమనండి. నేను రెడీగా ఉన్నా” అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నలుగురి మధ్య చర్చగా ఉన్న పలు అంశాలపై జగన్ స్పందించటం.. సమాధానం ఇవ్వటం ద్వారా ఆయా అంశాల విషయంలో తాను ఏం అనుకుంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
తాము ఆర్థిక విధ్వంసం చేయలేదని.. చంద్రబాబు చేసింది.. చేస్తున్నది ఆర్థిక విధ్వంసంగా పేర్కొన్నారు. తొమ్మిది నెలల చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారన్న జగన్మోహన్ రెడ్డి.. ‘ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. మా హయాంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం దందా చేశారంటున్నారు. లోక్ సభలో వైసీపీ పక్షానికి నేత అయిన ఆయనకు మద్యంతో ఏం సంబంధం ఉంటుంది?’ అని ప్రశ్నించారు. మొత్తంగా చూసినప్పుడు.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనంత కాలం తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పక తప్పదు.
This post was last modified on February 7, 2025 11:00 am
ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…
హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్‌కు అనుకున్న ఆ చిత్రం…
అధికారంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు సహజం. ఎంత బాగా పాలన చేశామని చెప్పుకొన్నా.. ఎంత విజన్‌తో దూసుకుపోతున్నామని చెప్పుకొన్నా.. ఎక్కడో…