Political News

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన క్ర‌తువు పూర్త‌యింద‌ని ఆర్థిక శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏయే ప్రాజెక్టుల‌కు ఎంతెంత కేటాయించాలి? సూప‌ర్ సిక్స్‌లో ఏయే ప‌థ‌కాల‌కు ఎంత ఇవ్వాల‌న్న విష‌యాల‌పై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు ఆర్థిక శాఖ అధికారులు, మంత్రితోనూ భేటీ అయ్యారు.

వాస్త‌వానికి ముంద‌స్తుగా నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌కారం అయితే..ఈ ఏడాది కూడా సూప‌ర్ సిక్స్ గురించి పెద్ద‌గా ప్ర‌స్తావించే అవ‌కాశం లేదు. కానీ, ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తీసుకున్న త‌ర్వాత‌.. గ‌ట్టిగా మూడు ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా మాతృవంద‌నం ప‌థ‌కాన్ని మ‌హిళ‌లు ఎక్కువ‌గా కోరుతున్నారు. ఆ వెంట‌నే రెండోది ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. మూడో రైతుల‌కు ఇస్తామ‌న్న అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం.

ఈ మూడు ప‌థ‌కాల‌కు తోడు.. 18 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు నెల నెలా ఇస్తామ‌న్న రూ.1500 ఆడ‌బిడ్డ నిధి. ఈ నాలుగు ప‌థ‌కాలు కూడా.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా కోరుకుంటున్నారు. స‌ర్వేలు.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సంపూర్ణంగా తెలుసుకున్నాక‌.. ఈ నాలుగు ప‌థ‌కాల్లో రెండింటినైనా తాజా బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ పెట్ట‌క‌పోతే.. ఇబ్బంది త‌ప్ప‌దని ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో ఆయా ప‌థ‌కాల్లో భారీ భారం ప‌డ‌ని.. ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణానికి నిధులు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

అదేవిధంగా రైతుల‌కు ఇస్తామ‌న్న అన్న‌దాత సుఖీభ‌వ‌ను కూడా బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావించ‌నున్నారు.ఇది కొంత వ‌ర‌కు భార‌మే అయినా.. కేంద్రం సాయం చేస్తున్న 6 వేల రూపాయ‌ల‌ను దీనిలో క‌లిపి ఇవ్వ‌ను న్నారు. దీంతో కొంత వ‌ర‌కు ఆర్థిక భారం నుంచి త‌ప్పించుకునే వెసులు బాటు ఉండ‌నుంది. ఇక‌, ఆర్టీసీ బ‌స్సుల కోసం.. నెలకు రూ.180-200 కోట్ల వ‌ర‌కు భ‌రించేందుకు కూడా.. సీఎం చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ రెండు ప‌థ‌కాల‌కు కూడా.. బ‌డ్జెట్‌లో చోటు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on February 6, 2025 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago