Political News

విశాఖ ఉక్కుపై కేంద్రం కీలక నిర్ణయం

ఇదిగో విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా కేంద్ర ఉక్కు శాఖా మంత్రి కుమార స్వామి చెప్పినా సరే…వైసీపీ నేతలు మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం ఆపడం లేదు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు అంటూ విశాఖ ఉక్కు అంత స్ట్రాంగ్ ప్రకటన ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పూర్తిస్థాయిలో ఐరన్‌ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

వాస్తవానికి 2025 ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్ ను ఆపరేషన్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నెలకు దాదాపు 6 లక్షల టన్నుల ఐరన్‌ ఓర్‌ అవసరమవుతుంది. దీంతో, రోజుకు 8 ర్యాక్‌ల గూడ్స్‌ రైళ్ల ఐరన్ ఓర్ సరఫరా చేయాలని ఒప్పందం ఉంది. కానీ, 6 ర్యాక్ లకు మించి సరఫరా కావడం లేదు. అయితే, ఇకపై పూర్తి స్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం 2027 మార్చి వరకు అమలులో ఉండేలా ఎన్ఎమ్ డీసీ, ఆర్ఐఎన్ఎల్ ల మధ్య ఒప్పందం జరిగింది.

కూటమి ప్రభుత్వం చొరవతోనే కేంద్రం పూర్తి స్థాయి ఐరన్ ఓర్ సరఫరా నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కును ఆదుకోవాలని సీఎం చంద్రబాబుతోపాటు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ టూర్ లో పదే పదే కేంద్రం పెద్దలకు చెబుతున్నారు. వికసిత్‌ ఏపీ, వికసిత్ భారత్‌ కోసం 2030 నాటికి 30కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి టార్గెట్ గా కేంద్రం పెట్టుకుంది. ఈ క్రమంలోనే రూ.1,640 కోట్లను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అత్యవసర నిధులుగా అందించింది. ఆ తర్వాత రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ కూడా ప్రకటించింది.

ముఖ్యంగా తాజాగా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో మంత్రి కుమారస్వామితో భేటీ అయిన సందర్భంగా విశాఖ ఉక్కుపై చర్చించారని తెలుస్తోంది. ఆ భేటీ అయిన రెండు రోజుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏది ఏమైనా…చంద్రబాబు రాజకీయ వారసుడిగా…తండ్రికి తగ్గ తనయుడిగా లోకేశ్ రాటుదేలుతున్నారని అనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం.

This post was last modified on February 6, 2025 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ రెడీ.. ఆ రెండు ప‌థ‌కాల‌కే నిధులు ..!

ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను…

15 minutes ago

తండేల్ పాసవ్వాల్సిన 4 పరీక్షలు

ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…

34 minutes ago

లైలా… ఇంత స్పైసీ ఉంటే ఎలా

విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…

1 hour ago

అక్రమ వలసల విషయంలో భారత్ స్టాండ్ ఏంటి?

అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…

1 hour ago

‘తాడేప‌ల్లి ప్యాల‌స్‌’కు నిప్పు.. అనేక సందేహాలు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం క‌మ్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని ప్యాల‌స్‌కు గుర్తు తెలియ‌ని…

2 hours ago

‘లైగర్’లో ఇష్టం లేకుండానే నటించిందట

విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…

2 hours ago