రైల్వేలలో కొత్త జోన్ కోసం జరిగిన ప్రయత్నాలు.. ఒత్తిళ్లు ఎట్టకేలకు ఫలించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పక్కన పెట్టేసిన మోడీ సర్కారు.. ఎట్టకేలకు కూటమి ఒత్తిళ్లకు తలొగ్గి.. ఓకే చెప్పింది. దీంతో.. రైల్వే వ్యవస్థలో సరికొత్త జోన్ కు శ్రీకారం చుట్టినట్లైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ను ఏర్పాటుకు అంగీకారం కుదిరంది. అనేక తర్జనభర్జనలు.. చర్చలు.. ఒత్తిళ్లతోనే ఈ కొత్త జోన్ అవతరించిందని చెప్పాలి. తాజా నిర్ణయంతో ఏపీ పరిధిలో పని చేస్తున్న డివిజన్లు కోతలకు.. కుదింపులకు.. మార్పులకు గురికానున్నాయి.
దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే వాల్తేరు డివిజన్ ను రద్దు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డివిజన్ ఇకపై విశాఖపట్నం డివిజన్ గా అందుబాటులోకి రానుంది. నిజానికి దీనిపై గత నెల పదో తేదీన కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికి.. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్ లోనూ.. ఏపీలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉన్నాయి.
ఇప్పుడు ఈ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ గా ఏర్పాటు చేశారు. ఇందులో విజయవాడ, పాత వాల్తేరులోని కొంత భాగం.. విజయవాడ.. గుంటూరు. .గుంతకల్ డివిజన్లు ఉంటాయి. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని విభజన వేళలో హామీ ఇచ్చారు. దాన్ని మోడీ 1.0 పక్కన పెట్టేసింది. చివరకు ఐదేళ్ల క్రితం విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఇస్తామని ఇదే మోడీ 2.0లో ప్రకటించారు. నెల క్రితం జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి మోడీ3.0లో ఆయనే శంకుస్థాపన చేయటం విశేషం.
ఈ జోన్ ఏర్పాటుతో 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్ రద్దు కానుంది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చు పది డివిజన్లలో వాల్తేరు డివిజన్ ఒకటి. ఏడాదికి రూ.10వేల కోట్ల ఆదాయం దీని నుంచి వస్తుంటుంది. దీన్ని విశాఖ జోన్ లో కలపకపోతే.. విశాఖ జోన్ కే అర్థం లేదన్న డిమాండ్ తో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. దీనికి ఏపీ ఎంపీల చొరవ.. ఒత్తిడితోనే సాధ్యమైందన్న మాట వినిపిస్తోంది. మోడీ 3.0లో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడి ప్రత్యేక చొరవ కూడా తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు.
This post was last modified on February 6, 2025 3:34 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…