టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధుల విడుదల, ప్రత్యేక రైల్వే జోన్ పనుల వేగవంతం తదితరాలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా తాజాగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులనూ ప్రస్తావించిన లోకేశ్.. రైౌల్వే మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రైల్వే ప్రాజెక్టులే కాకుండా ఇతరత్రా విషయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినా…ఓ విషయం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అశ్వినీ వైష్ణవ్ తో భేటీ కోసం ఆయన అధికారిక నివాసానికి చేరుకున్న సందర్భంగా ఆయనను లోకేశ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాలువాను వైష్ణవ్ కు కప్పిన లోకేశ్.. తిరుమల వెంకన్న విగ్రహాన్ని కూడా అందజేశారు. ఆ తర్వాత అరకు కాఫీ అంటూ ఓ సుందరమైన ప్యాకింగ్ ను లోకేశ్… వైష్ణవ్ చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా సర్ అరకు కాఫీ అంటూ ఆ ప్యాకేజీని అందించగా…వావ్ ఇట్స్ వండర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించిన వైష్ణవ్ దానిని స్వీకరించారు.
అయినా ఈ అరకు కాఫీ గోలేంటీ? అంటారా.? ఏపీలోని విశాఖ, అరకు ప్రాంతాల్లో గిరిజనులు పండిస్తున్న కాఫీకి మంచి గిరాకీ ఉంది. సుమధురమైన ఈ కాఫీని ఏపీ ప్రభుత్వం అరకు కాఫీ పేరిట ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ దక్కేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి దావోస్ టూర్ లో ఏపీ పెవిలియన్ లో ఏకంగా అరకు కాఫీ మిషన్ పెట్టిన చంద్రబాబు అక్కడికి వచ్చిన వారికి ఆ రుచిని పరిచయం చేశారు. తాను కలిసే ప్రతి అతిథికీ అరకు కాఫీ ప్యాకేజీ ఇస్తూ వస్తున్నారు. తన తండ్రిని చూసిన లోకేశ్… తాను కూడా అరకు కాఫీని ఎందుకు ప్రమోట్ చేచయకూడదని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తాను కూడా అరకు కాఫీ ప్యాకేజీలను ప్రముఖులకు బహూకరిస్తూ సాగుతున్ానరు. ఈ లెక్కన అరకు కాఫీకి వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజీ అతి త్వరలోనే దక్కనుందని చెప్పొచ్చు.
This post was last modified on February 4, 2025 9:38 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…