Political News

ఫిబ్ర‌వ‌రి 4.. నాకు స్పెష‌ల్ డే: రేవంత్‌రెడ్డి

“ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్ర‌త్య‌కంగా గుర్తుండిపోయే రోజు” అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న అసెంబ్లీలో కీల‌క ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై వేసిన ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక‌పై సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. అదేవిధంగా కుల గ‌ణ‌న నివేదిక‌ను కూడా స‌భ‌కు మ‌రోసారి వివ‌రించారు. ఈ రెండు అంశాలు కూడా.. త‌న‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయ‌ని.. వాటినిస‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకున్న రోజుగా రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎంద‌రో ముఖ్య‌మంత్రులు ఈ రాష్ట్రాన్నిపాలించినా.. వారెవ‌రికీ రాని అవ‌కాశం త‌న‌కు ల‌భించింద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకే రోజు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌, కుల గ‌ణ‌న‌ల‌ను స‌భ‌కు స‌మ‌ర్పించే అవ‌కాశం అరుదైన అంశంగా పేర్కొన్నారు. ఒక‌ప్పుడు వ‌ర్గీక‌ర‌ణ‌ను రాజ‌కీయ అంశంగానే చూశారంటూ.. గ‌త పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, తాము ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఎస్సీల‌కు న్యాయం చేయాల‌న్న ఏకైక త‌లంపుతో సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పు మేర‌కు.. ఏక స‌భ్య క‌మిష‌న్ ఏర్పాటు చేసి.. వారికి న్యాయం చేసే దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు తెలిపారు. 40-50 ఏళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే అవ‌కాశం ల‌భించ‌డం అదృష్టంగా భావిస్తున్నామ న్నారు.

ఎస్సీల్లో 59 ఉప కులాల‌ను ఏబీసీలుగా వ‌ర్గీక‌రించార‌ని తెలిపారు. దీంతో వారికి రాజ్యాంగ‌, సంక్షేమ ఫ‌లాలు చేరువ అవుతాయ ని సీఎం చెప్పారు. అన్ని వ‌ర్గాల‌నుంచి వ‌చ్చిన అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని,మేధావుల సూచ‌న‌ల‌ను కూడా ఏక‌స‌భ్య క‌మిష‌న్ త‌న నివేదిక‌లో పొందు ప‌రిచింద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నివేదిక అమ‌లైతే.. రాష్ట్రంలో ఎస్సీల‌కు మెరుగైన జీవితం చేరువ అవుతుంద‌న్నారు. ఇక‌, కుల గ‌ణ‌న కూడా.. రికార్డు అంశంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుక బ‌డిన వ‌ర్గాలు త‌ర‌త‌రాలుగా అలానే ఉండిపోతున్నాయ‌ని.. ఇప్పుడు వారికి న్యాయం చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు. ఈ విష‌యంలో ఎంతో కృషి జ‌రిగింద‌ని.. అన్ని అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఉంద‌ని సీఎం చెప్పారు.

This post was last modified on February 4, 2025 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

26 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago