తిరుపతి నగర పాలక సంస్థలో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ ఎన్నిక గడచిన నాలుగైదు రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటకీయ పరిణామాలకు కారణంగా నిలిచింది. సరిగ్గా… డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ… తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా… ఆ వ్యాఖ్యలు సరికాదని ఆ మరుక్షణమే తేలిపోవడం గమనార్హం.
వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగగా… ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైసీపీకే దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి… వైసీపీని చిత్తు చేయగా… తిరుపతికి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. ఈ క్రమంలో వైసీపీ బలం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మారిన బలాబలాల నేపథ్యంలో జరుగుతున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఆయన చేతిలో పరాజయం పాలైన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేశారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తిరుపతికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ నకు గురయ్యారని వార్తలు వచ్చాయి. దీనిపై మంగళవారం స్పందించిన భూమన… వైద్యుడైన సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ,జనసేనలకు చెందిన నేతలు కిడ్నాప్ చేయడం సరికాదన్నారు. ఈ కిడ్నాప్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శాప్ చైర్మన్ రవి నాయుడు కీలక భూమిక పోషించారని ఆయన ఆరోపించారు. సుబ్రహ్మణ్యానికి ఏం జరిగినా కూటమిదే బాధ్యత అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని… సమయానికి తిరుపతి ఎంపి గురుమూర్తి, తన సతీమణి అక్కడికి వెళ్లి అభినయ్ ని క్షేమంగా తీసుకువచ్చారంటూ ఆయన ఆరోపించారు.
భూమన ఇలా మీడియాతో మాట్లాడిన కొంతసేపటికే సిపాయి సుబ్రహ్మణ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చి చేరింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను క్షేమంగానే ఉన్నానని ఆయన సదరు వీడియోలో తెలిపారు. తాను కిడ్నాప్ అయ్యానన్న వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన తెలిపారు. అంతేకాకుండా సోమవారం రాత్రి తాను తన ఇంటిలోనే ఉన్నానని కూడా తెలిపారు. ఈ వీడియోతో భూమన కూటమి పార్టీలపై అసత్య ఆరోపణలు చేశారని తేలిపోయింది. ఏమీ జరగకున్నా..కిడ్నాప్, హత్యాయత్నం అంటూ భూమన రాద్దాంతం చేస్తున్నారని కూటమి పార్టీల నేతలు సెటైర్లు సంధించారు. వెరసి భూమన అడ్డంగా బుక్కయ్యారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
This post was last modified on February 4, 2025 2:11 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…