పట్టలేనంత కోపం ఉండొచ్చు. హద్దులు దాటే ఆగ్రహం రావొచ్చు. అయితే.. మాత్రం నోటిని అదుపులో ఉంచుకోకపోతే అంతకు మించిన ఇబ్బంది మరింకేమీ ఉండదు. తాజాగా అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు అవాక్కు అవుతున్నారు.
ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఒక సీనియర్ నేత నోట ఇలాంటి దారుణమైన మాటలు రావటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఇంతకూ జరిగిందేమన్నది చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు జంప్ కావటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కమల్ నాథ్ సర్కారు కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో భాగంగా తాజాగా ఆ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయిన ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. ఆమె పేరు.. ఇమర్తీ దేవి. గ్వాలియర్ లోని డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు.
28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్నఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాజీ సీఎం కమల్ నాథ్.. ఆగ్రహంతో నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాధారణమైన వారని.. ఆమెలా ఐటెం కాదని ఆయన నోరు జారారు. దీంతో.. ఇదో సంచలనంగా మారటంతో పాటు.. ఆయన మాట విన్న వారంతా తీవ్ర ఆగ్రహానికి గురి కావటంతో పాటు.. ఇదేం పాడు మాట అంటూ తిట్టిపోస్తున్నారు.
కమల్ నాథ్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము లేఖ రాస్తామని.. దళిత మహిళను కించపరిచినందుకు కాంగ్రెస్ హైకమాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. మాజీ సీఎం నోటి నుంచి వచ్చిన ఐటెం మాట.. ఇప్పుడో తలనొప్పిగా మారింది. కమలనాథ్ మాటలతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on October 20, 2020 1:05 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…