Political News

అసెంబ్లీకి రాకుంటే వేటు తప్పదు సారూ..!

తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి తొలి రోజు సమావేశానికి వచ్చి ఆ 11 మంది మమ అనిపించారు.ఇక తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులంతా ఎంచక్కా సభకు వస్తున్నారు. అధికార పక్షానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అయితే ప్రదాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం అసెంబ్లీ గడప తొక్కట్లేదు. ఇదేం పద్దతి అంటూ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అనే ఓ రైతు సంస్థ ఆయనను నిలదీసింది.

కేసీఆర్ ను ఆ సంస్థ నిలదీయడంతోనే వదిలిపెట్టలేదండోయ్… ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బయటకు వద్దామని భావిస్తున్న కేసీఆర్ కు ఈ పరిణామం ఊహించనిదేనని చెప్పక తప్పదు. రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి… అసెంబ్లీకి వచ్చి… రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు అసలు అసెంబ్లీ ముఖమే ఎందుకు చూడట్లేదని సదరు నోటీసుల్లో ఆ సంస్థ ప్రశ్నించింది. అసెంబ్లీకి రాకపోవడం అంటే… ప్రదాన ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైనట్టేనని కూడా ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్కడితో సరిపెట్టని ఆ రైతుల సంస్థ… అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్న విషయాన్ని కేసీఆర్ నుంచి రాబట్టాలని స్పీకర్ కార్యాలయాన్ని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేసీఆర్ కు సమన్లు జారీ చేయాలని కూడా కోరింది. కేసీఆర్ నుంచి ఆమోదించదగ్గ సమాధానం వస్తే సరేసరి.. లేదంటే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆ సంస్థ స్పీకర్ ను కోరింది. అసెంబ్లీ రాకుండా ఇప్పటికే కేసీఆర్ ఓ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హతను కూడా కోల్పోయారని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి విజయపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంస్థ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి… నోటీసులను మెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా కేసీఆర్ కు పంపారు.

This post was last modified on February 4, 2025 10:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీరే తేల్చుకోండి: రెండు రాష్ట్రాల విష‌యంలో కేంద్రం బంతాట‌!

విభ‌జ‌న హామీల అమ‌లు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది.…

6 hours ago

జ‌గ‌న్ మాదిరి త‌ప్పించుకోం: నారా లోకేష్‌

మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ముఖ్య‌మంత్రి.. ఏపీ విధ్వంస‌కారి అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్…

7 hours ago

ఔను.. మేం త‌ప్పు చేశాం.. మోడీ ముందు ఒప్పుకొన్న రాహుల్‌!

అధికార ప‌క్షం ముందు ప్ర‌తిప‌క్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్ర‌మైనా.. రాష్ట్ర‌మైనా.. ఒక్క‌టే రాజ‌కీయం. మంచి చేసినా.. చెడు చేసినా..…

8 hours ago

ఈ రెడ్డి గారికి ఎవరితోనూ పొసగట్లేదు!

చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో…

9 hours ago

ఓటీటీలో మార్కో… ఇంకా ఎక్కువ డోస్

మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…

10 hours ago

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే…

11 hours ago