ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో పాలక పక్షాలు మారిపోతున్నాయి.
కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అటుఇటూ మారిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యంగా మారగా…అది టీడీపీ ఖాతాలో చేరిపోనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా వైరి వర్గాల నుంచి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయితే అందుకు విరుద్ధంగా టీడీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఇబ్బంది తలెత్తుతోంది. నందిగామ నగర పంచాయతీ చైర్ పర్సన్ పదవికి శాఖమూరి స్వర్ణలత పేరును ఖరారు చేసింది.
అయితే స్తానిక ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్య మాత్రం స్వర్ణలత అభ్యర్థిత్వానికి ససేమిరా అంటున్నారు. అధిష్ఠానాన్ని సంప్రదించకుండానే… పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ సత్యవతికి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించాలని సౌమ్య నిర్ణయించినట్లుగా సమాచారం.
ఈ విషయం తెలిసిన స్థానిక ఎంపీ కేశినేని చిన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని ఎమ్మెల్యేకు సూచించారట. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎందుకు సంప్రదించరంటూ సౌమ్మ ప్రశ్నించారట. స్థానిక ఎమ్మెల్యేగా తాను ఇప్పటికే సత్యవతికి మాట ఇచ్చానని, ఆమె అభ్యర్థిత్వానికే పార్టీ అనుమతి ఇవ్వాలని కోరారట.
అయితే అధిష్ఠానం ఓ అభ్యర్థిని నిర్ణయించాక మళ్లీ మార్చడం అంటూ ఉండదని, స్వర్ణలత అభ్యర్థిత్వానికే ఒప్పుకుని తీరాలని చిన్ని చెప్పారట. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సౌమ్య సోమవారం జరగాల్సిన చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడేలా చేశారట. మరి మంగళవారమైనా ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.
This post was last modified on February 3, 2025 4:32 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…