Political News

అన్నను వదిలి చెల్లితో కలిసి సాగుతారా..?

రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. రాజకీయాల్లో ఉండగా… నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సాయిరెడ్డి…ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా మీడియా అటెన్షన్ లేకుండా సాగలేకపోతున్నట్లుగా ఉంది. రాజకీయ సన్యాసం తర్వాత సాగులోకి దిగుతున్నానంటూ ఇటీవలే తన వ్యవసాయ క్షేత్రంలో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో సాయిరెడ్డి భేటీ అయ్యారట. 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లిన సాయిరెడ్డి… షర్మిలతో ఏకంగా 3 గంటలకు పైగా షర్మిలతో భేటీ అయ్యారట. షర్మిలతో కలిసి అక్కడే హద్యాహ్న భోజనం కూడా చేశారట. ఈ సందర్భంగా షర్మిలతో ఆయన ురాజకీయాలపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అత్యంత రహస్యంగానే జరిగినా… రెండు రోజులకే ఈ బేటీ గురించి బయటకు తెలిసిపోయింది. సాయిరెడ్డి ద్వారానే ఈ సమాచారం బయటకు పొక్కినట్టుగా తెలుస్తోంది.

వాస్తవానికి జగన్, షర్మిల ఇద్దరితోనూ సఖ్యతగానే సగిన సాయిరెడ్డి… వారిద్దరి మధ్య వివాదాలు రావడంతో జగన్ వెంటే నడిచారు. అంతేకాకుండా షర్మిలను టార్టెట్ చేస్తూ సాయిరెడ్డి ఒకింత ఘాటు ఆరోపణలే చేశారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ విజయయ్యపైనా సెటైర్లు సంధించారు. మొత్తంగా తనకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన సాయిరెడ్డి… షర్మిలను మాత్రం ఓ రేంజిలో టార్గెట్ చేశారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి విమర్శలు సంధించిన సందర్భాలు కోకొల్లలు. ఇదే విషాయన్ని ఇటీవలే షర్మిల స్వయంగా బయటపెట్టారు కూడా. తననే కాకుండా తన పిల్లలను కూడా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి అబద్ధాలు చెప్పారంటూ ఆమె విరుచుకుపడ్డారు.

అయితే జగన్ నుంచి… .పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా జరిగిన సాయిరెడ్డి ఇప్పుడు నేరుగా షర్మిలతో బేటీ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఆడిటర్ గా వైఎస్ ఫ్యామిలీలో అందరితోనూ సత్సంబంధాలే కలిగిన సాయిరెడ్డి… షర్మిలతో భేటీ పెద్ద విషయం కాకున్నా… రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఆమె వద్దకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా సుదీర్ఘంగా ఆమెతో భేటీ కావడం చూస్తుంటే.. అన్నను వదిలేసిన సాయిరెడ్డి ఇప్పుడు చెల్లితో రాజకీయం చేద్దామనుకుంటున్నారా? అన్న దిశగా ఆసక్తికర సెటైర్లు పడుతున్నాయి.

This post was last modified on February 2, 2025 10:27 am

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

32 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

1 hour ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

1 hour ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago