కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న ‘పాత పన్ను’ విధానంలో 5 -7 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండర్డ్ డిడక్షన్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం పన్ను పరిమితిని పెంచాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2021లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా నిన్న మొన్నటి వరకు 7.5 లక్షలుగా పేర్కొన్నారు. కానీ, దీని వైపు మొగ్గు చూపేందుకు ఉద్యోగులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం.. కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచింది. అంటే.. ఎవరైనా ఉద్యోగి.. ఏడాదికి రూ.12 లక్షలు సంపాయిస్తే.. రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. ఇక్కడ ఆదాయం అంటే.. అర్ధం మారుతుంది. ఆదాయం అంటే.. వ్యక్తిగత ఆదాయమే కాదు.. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి.. వ్యక్తిగత ఆదాయం ఏడాది రూ.8 లక్షలు సంపాయిస్తున్నారని అనుకుంటే.. ఆయనకు ఇంటి అద్దెలు, బ్యాంకులో పొదుపులపై వస్తున్న వడ్డీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వస్తున్న వడ్డీ.. ఇతర రూపాల్లో సమకూరే ఆదాయాలను ఇప్పుడు లెక్కిస్తారు.
ఇవన్నీ కలిపినా.. రూ.12 లక్షలకు మించకపోతే.. రూపాయి కూడా వడ్డీ తీసుకోరు. కానీ, 12 లక్షల రూపాయలకు మించితే మాత్రం పన్నులు తప్పవు. అయితే.. ఇక్కడ కూడా కొంత ఊరట ఉంది. 12 లక్షల రూపాయలకు మించి ఆదాయం పొందుతున్న వారికి కూడా.. తొలి 4 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 4 లక్షల తర్వాత.. మరో 75 వేల వరకు.. ఎల్ ఐసీలు, పొదుపు ఖాతాలను చూపించుకోవచ్చు. అంటే.. మొత్తంగా 4.75 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కానీ, ఆ తర్వాత మాత్రం శ్లాబుల వారీగా లెక్కించి పన్నులు వసూలు చేస్తారు.
This post was last modified on February 1, 2025 6:26 pm
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…
వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…
పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…
రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర…
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో…
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి…