ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య ఇప్పుడు రసవత్తర రాజకీయం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మునిసిపాలిటీలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలు కాగా… శుక్రవారం గుంటూరులోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హిందూపురంలో చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ, వైసీపీల మధ్య పోరు సాగుతుంటే… గుంటూరులో కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయీలు మొదలు కావడం గమనార్హం.
వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా మునిసిపాలిటీలతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ కూడా ఆ పార్టీ చేతికే చిక్కింది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 58 వార్డులు ఉండగా… ఎన్నికల సమయంలో వైసీపీ 47 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి 9, జనసేనకు 2 సీట్లు దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే… వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో ఇద్దరు కూడా టీడీపీలో చేరారు. ఇంకో ముగ్గురు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ బలం జనసేనతో కలుపుకుని 21కి చేరగా… వైసీపీ బలం 37గా ఉంది. ఈ బలాలు ఇలాగే కొనసాగితే… వైసీపీని కట్టడి చేయడం కుదరదు.
ఇలాంటి కీలక తరుణంలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగిపోయారు. టీడీపీ వైపు చూస్తున్న కార్పొరేటర్లను లాగేసుకునేందుకు ఆయన పక్కా వ్యూహాలు రచించారు. ఎలాగైనా కార్పొరేషన్ లో టీడీపీ మెజారిటీ సాధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ తరఫున గెలిచిన, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు జారిపోకుండా మొత్తం 21 మందిని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల దాకా వారిని క్యాంపుల్లోనే ఉంచనున్నారు. కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తే… వారిని కూడా క్యాంపులకు తరలించనున్నారు.
పెమ్మసాని స్పీడును చూసిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు జారి పోకుండా వారందరినీ ఆయన కూడా క్యాంపునకు తరలించారు. పెమ్మసాని మాదిరే వైసీపీ కార్పొరేటర్లను కూడా అంబటి ఫిబ్రవరి 3న నేరుగా కార్పొరేషన్ భేటీకి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ శిబిరంలోని చాలా మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపుగా వైసీపీ శిబిరంలోని 10 మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు సమాచారం. వారంతా టీడీపీలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి వారిని నిలువరించుకుని పెమ్మసాని వ్యూహాలకు అంబటి చెక్ పెట్టగలరా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on January 31, 2025 6:04 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…